
తాజా వార్తలు
భారీ సిక్సర్లు బాదే క్రమంలో ఔటైన మయాంక్
ఇండోర్: టీమిండియా యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (243; 330 బంతుల్లో 28×4, 8×6) ఆటకు అభిమానులు ఫిదా అవుతున్నారు. అతడి శతకాల జోరును చూసి ఆనందిస్తున్నారు. కెరీర్లో కేవలం 8 టెస్టులే ఆడిన మయాంక్ బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రెండో డబుల్ సెంచరీ అందుకోవడంతో సారథి విరాట్ కోహ్లీ పట్టలేని ఆనందంతో కనిపించాడు. భారీ సిక్సర్‌తో లాంఛనం పూర్తి చేసుకున్న తర్వాత మయాంక్ ఆకాశం వైపు చూస్తూ సంబరాలు చేసుకున్నాడు. వెంటనే టీమిండియా డ్రస్సింగ్ రూమ్‌వైపు బ్యాట్‌తో అభివందనం చేశాడు. రెండో ద్విశతకం చేశానని చేతివేళ్లతో కెప్టెన్ కోహ్లీకి సైగలు చేశాడు. అందుకు చిరునవ్వుతో స్పందించిన విరాట్ మూడు వేళ్లను చూపిస్తూ ‘త్రిశతకం బాదాలి మరి’ అని కవ్వించాడు.
దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించిన మయాంక్‌కు జాతీయ జట్టులో అంత సులభంగా చోటు దొరకలేదు. అయినప్పటికీ అతడు తన బ్యాటు ద్వారానే సెలక్టర్లకు సంకేతాలు పంపించాడు. తనను ఎంపిక చేయక తప్పని పరిస్థితి కల్పించాడు. తుది జట్టులో చోటు దక్కగానే శతకాలతో విజృంభించడం మొదలు పెట్టాడు. విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో తొలి ద్విశతకం (215) బాదిన మయాంక్ ఆ తర్వాతా అదే జోరు కొనసాగించాడు. చివరి నాలుగు టెస్టుల్లో 215, 7; 108; 200*తో చెలరేగాడు. రెండో డబుల్ సెంచరీ చేయడానికి మయాంక్ తీసుకున్నది కేవలం 12 ఇన్నింగ్సులే కావడం ప్రత్యేకం. డాన్ బ్రాడ్‌మన్ ఇందుకు 13 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. ఇక టెస్టుల్లో రెండు ద్విశతకాలు బాదిన కోహ్లీ, వినూ మన్కడ్, వసీమ్ జాఫర్ సరసన నిలిచాడు. అయితే త్రిశతకం చేయాలన్న కసితో భారీ సిక్సర్లు బాదడం మొదలు పెట్టిన మయాంక్ వ్యక్తిగత స్కోరు 243 వద్ద ఔటయ్యాడు. మెహదీ హసన్ వేసిన 107.3వ బంతికి అబు జయేద్‌కు క్యాచ్ ఇచ్చాడు.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ఎన్‌కౌంటర్‌పై అనుమానాలున్నాయా?
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- ఎస్కేయూ ఉపకులపతి జయరాజ్ హఠాన్మరణం
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
