close

తాజా వార్తలు

తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసిన టీమిండియా

ఇండోర్‌: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. గురువారం ప్రారంభమైన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పర్యాటక జట్టు 150 పరుగులకే కుప్పకూలింది. భారత్‌ రెండో రోజు 493/6 పరుగులు చేయగా, తొలి ఇన్నింగ్స్‌లో 343 పరుగుల ఆధిక్యం లభించింది. మయాంక్‌ అగర్వాల్‌ (243; 330 బంతుల్లో 28x4, 8x6), రహానె (86; 172 బంతుల్లో 9x4), రవీంద్ర జడేజా (60 నాటౌట్‌; 76 బంతుల్లో 6x4, 2x6) చెలరేగడంతో భారత్‌ భారీ స్కోర్‌ సాధించింది. ఈ నేపథ్యంలో మూడో రోజు శనివారం ఉదయం భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేశాడు. దీంతో బంగ్లా రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది.

 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.