
తాజా వార్తలు
ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో కోహ్లీసేన జయభేరి
ద్విశతక వీరుడు మయాంక్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్
ఇండోర్: అనుకున్నదే జరిగింది. కోహ్లీసేన కేవలం మూడు రోజుల్లోనే జయభేరీ మోగించింది. తొలిటెస్టులో బంగ్లాదేశ్‌పై ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మూడోరోజు, శనివారం ఆట ఆరంభానికి ముందు ఓవర్‌నైట్ స్కోరు 493/6 వద్దే టీమిండియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. భారీ లోటుతో బ్యాటింగ్‌కు దిగిన ప్రత్యర్థిని 69.2 ఓవర్లకు 213 పరుగులకు ఆలౌట్ చేసింది. ముష్ఫికర్ రహీమ్ (64; 150 బంతుల్లో 7×4) ఒక్కడే ఆఖరి వరకు ఒంటరి పోరాటం చేశాడు. మహ్మద్ షమి (4/31), అశ్విన్ (3/42), ఉమేశ్ యాదవ్ (2/51) బంగ్లా పతనాన్ని శాసించారు. ఇషాంత్‌కు ఒక వికెట్ దక్కింది. ఈ విజయంతో కోహ్లీ అరుదైన రికార్డు సాధించాడు. ప్రత్యర్థిని 10 సార్లు ఇన్నింగ్స్ తేడాతో ఓడించిన ఏకైక భారత సారథిగా ఘనత అందుకున్నాడు. ధోనీ (9)ని దాటేశాడు. 1992/93, 1993/92 తర్వాత ఈ సీజన్లో భారత్ వరుసగా మూడోసారి ఇన్నింగ్స్ తేడాతో గెలవడం ప్రత్యేకం. ఈ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్ ఖాతాలో మరో 60 పాయింట్లు చేరాయి.
రెండో ఇన్నింగ్స్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు టీమిండియా పేసర్లు శుభారంభం దక్కనివ్వలేదు. ఓపెనర్లు షాద్మన్ ఇస్లామ్ (6)ను ఇషాంత్, ఇమ్రుల్ కయెస్ (6)ను ఉమేశ్ జట్టు స్కోరు 16లోపే పెవిలియన్ పంపించారు. మరికాసేపటికే సారథి మొమినల్ హఖ్ (7), మహ్మద్ మిథున్ (18)ని షమి ఔట్ చేసి షాకిచ్చాడు. ఈ క్రమంలో మహ్మదుల్లా (15; 35 బంతుల్లో 2×4), లిటన్ దాస్ (35; 39 బంతుల్లో 6×4), మెహది హసన్ (38; 55 బంతుల్లో 5×4, 1×6) సహకారంతో ముష్ఫికర్ రహీమ్ (64; 150 బంతుల్లో 7×4) ఒంటరి పోరాటం చేశాడు. టీమిండియా బౌలర్లను ఎదుర్కొని అర్ధశతకం సాధించాడు. అతడు నిలకడగా ఆడటంతో బంగ్లా 60/4తో లంచ్‌కు వెళ్లింది. క్రీజులో కుదురుకున్న లిటన్ దాస్‌ను అశ్విన్, మెహది హసన్‌ను ఉమేశ్ ఔట్ చేయడంతో 191/6తో బంగ్లా తేనీటి విరామం తీసుకుంది. ఆ తర్వాత ఫుల్ లెంగ్త్‌తో అశ్విన్ వేసిన 67.5వ బంతిని ముషి బారీ షాట్ ఆడగా మిడాఫ్ నుంచి పరుగెత్తుకుంటూ వెళ్లిన పుజారా అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. దాంతో టీమిండియా విజయం లాంఛనమే అయింది.
స్కోరు వివరాలు
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: 150 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్: 493/6 డిక్లేర్
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్: 213 ఆలౌట్
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- రణ్‌బీర్‌కు ఆలియా అప్పుడే తెలుసు..!
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- ‘ఆ విషయంలో రాముడూ గ్యారెంటీ ఇవ్వలేడు’
- ఒక్కరికే ఛాన్స్: కోహ్లీ
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- రికార్డు స్థాయికి విదేశీమారక ద్రవ్య నిల్వలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
