close

తాజా వార్తలు

ఇండోర్‌లో భారత్‌ రికార్డుల పరంపర!!

ఇండోర్: బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్‌ 130 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీమ్ఇండియా బౌలర్ల ధాటికి బంగ్లా రెండో ఇన్నింగ్స్‌లో 213 పరుగులకే కుప్పకూలింది. దీంతో కోహ్లీసేన రెండు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ విజయంతో విరాట్‌ కోహ్లీ అరుదైన రికార్డు సాధించాడు. భారత్‌ తరఫున అత్యధికంగా ఇన్నింగ్స్‌ విజయాలు అందుకున్న కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. కోహ్లీ 10 టెస్టుల్లో ఈ ఘనత సాధించి అగ్రస్థానంలో నిలవగా, ఎంఎస్‌ ధోనీ (9) రెండో స్థానంలో ఉన్నాడు. ఈ తర్వాతి స్థానాల్లో అజారుద్దీన్‌ (8), సౌరభ్‌ గంగూలీ (7) ఉన్నారు. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో కొన్ని రికార్డులు నమోదయ్యాయి.

* ఒకే సీజన్‌లో వరుసగా మూడు టెస్టుల్లో ఇన్నింగ్స్‌ తేడాతో విజయం సాధించడం టీమ్ఇండియాకు ఇది మూడో సారి. పుణె, రాంచీ టెస్టుల్లో దక్షిణాఫ్రికాపై, ఇండోర్‌లో బంగ్లాపై కోహ్లీసేన వరుసగా ఇన్నింగ్స్‌ తేడాతో విజయం సాధించింది. అంతకుముందు టీమ్‌ఇండియా 1992/93, 1993/94 సీజన్లలో కూడా ఈ తరహాలోనే విజయం సాధించింది. 

* ప్రత్యర్థి జట్టు చేసిన స్కోరు కంటే ఎక్కువ పరుగులు సాధించిన టీమ్‌ఇండియా ఆరో బ్యాట్స్‌మన్‌గా మయాంక్‌ అగర్వాల్‌ రికార్డు సృష్టించాడు. బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 150, రెండో ఇన్నింగ్స్‌లో 213 పరుగులు మాత్రమే చేసింది. ఏ ఇన్నింగ్స్‌లోనూ మయాంక్‌ (243) స్కోరుని బంగ్లా దాటలేకపోయింది. 
భారత్‌ తరఫున ఈ ఘనత సాధించిన ఆటగాళ్లు
వినూ మన్కడే (231) × న్యూజిలాండ్‌ (209, 219); 1955/56
రాహుల్‌ ద్రవిడ్‌ (270) × పాకిస్థాన్‌ (224, 245); 2003/04
సచిన్ తెందుల్కర్‌ (248) × బంగ్లాదేశ్‌ (184, 202); 2004/05
విరాట్‌ కోహ్లీ (213) × శ్రీలంక (205, 166); 2017/18
రోహిత్‌ శర్మ (212) × దక్షిణాఫ్రికా (162, 133); 2019/20
మయాంక్‌ అగర్వాల్‌ (243) × బంగ్లాదేశ్‌ (150, 213); 2019/20

* షమికి మూడో అత్యుత్తమం
రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించిన షమి (4/31) స్వదేశంలో ఇన్నింగ్స్‌ పరంగా తన మూడో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఇటీవల విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో షమి (5/35) ఐదు వికెట్లతో సత్తా చాటాడు. ఇన్నింగ్స్‌ పరంగా షమికి ఇదే అత్యుత్తమం.  

* ఈ పరాజయంతో బంగ్లా విదేశాల్లో వరుసగా ఆరో ఓటమిని చవిచూసింది. దీనిలో ఐదు టెస్టులు ఇన్నింగ్స్‌ తేడాతోనే ఓటమిపాలైంది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.