close

తాజా వార్తలు

ఆమె తుపాకి గురిపెడితే పతకం దక్కాల్సిందే

తన వయసుకన్నా సాధించిన పతకాల సంఖ్యే ఎక్కువ. చిన్నవయసులోనే ఆసియా షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో 3 బంగారు పతకాలు సాధించింది హైదరాబాద్‌కు చెందిన షూటర్‌ ఈషాసింగ్‌. నవంబర్‌ 3నుంచి 14 వరకు దోహాలో జరిగిన 14వ ఆసియన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ తరుపున ప్రాతినిధ్యం వహించి  3 స్వర్ణ పతకాలు సాధించింది. 2022 యూత్ ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించడమే తన లక్ష్యం అంటున్న ఈషాసింగ్ ముందున్న లక్ష్యాలు ఆమె అనుభవాలను తెలుసుకుందాం...

ఆసియా చాంపియన్‌షిప్‌లో 3 స్వర్ణపతకాలు సాధించారు. ఎలా ఫీలవుతున్నారు.
ఈషా:  నాకు చాలా సంతోషంగా ఉంది.

14 ఏళ్ల వయసులో అంతర్జాతీయ స్థాయిలో ఇన్ని పతకాలు సాధించడం ఎలా సాధ్యమైంది.
ఈషా: తొమ్మిది ఏళ్ల వయసులోనే షూటింగ్‌ ప్రారంభించాను. ఇదంతా మా నాన్న వల్లనే సాధ్యమైంది.

షూటింగ్‌ రంగాన్నే ఎందుకు ఎంచుకోవాలనిపించింది.
ఈషా: చిన్నప్పటి నుంచి బ్యాడ్మింటన్‌, టెన్నిస్‌ వంటి ఆటలు ఆడాను కాని వాటిపై నాకు అంతగా ఆసక్తి కలగలేదు. ఈ షూటింగ్‌ ఎంచుకోవడానికి ముఖ్యకారణం మా నాన్నగారి స్నేహితుడు ఒకాయన గచ్చిబౌలిలో  షూటింగ్‌ శిక్షకుడిగా ఉండేవారు.అక్కడ చూసినప్పుడు నాకు ఇలాంటివి నేర్చుకోవాలని అనిపించింది. దాంతో అప్పటి నుంచి షూటింగ్‌ పట్ల ఆసక్తి కలిగింది.అందుకే షూటింగ్‌ని ఎంచుకున్నాను. అప్పడే తొలి రాష్ట్రస్థాయి పతకం గెలుచుకున్నాను.

మీ తండ్రి ఒక రేసర్‌. మీరేందుకు అటువైపు ఆసక్తి చూపలేదు?
ఈషా: నేనూ ముందుగా రేసింగ్‌నే ఎంచుకున్నాను. కాని రేసింగ్‌ పట్ల ఆసక్తి చూపలేకపోయాను. ఆతరువాత షూటింగ్‌పై ఆసక్తితో ఇటువైపు వచ్చాను.

మీ విజయాల్లో కుటుంబం పాత్ర ఎలా ఉంది.
ఈషా: ప్రతి విజయంలోనూ అమ్మానాన్న అలాగే నా గురువు పాత్ర కీలకం.మా నాన్న నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. వారి తోడ్పటు లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని అనుకుంటున్నాను.

ఓ వైపు ఆటలు, మరోవైపు చదువును ఎలా సమన్వయం చేస్తున్నారు.
ఈషా: క్రీడలతో పాటు చదువుకూ సమ ప్రాధాన్యం ఇచ్చాను. రోజూ ఉదయం 5:30కి ట్యూషన్‌కి వెళ్లేదాన్ని. అలాగే స్కూల్లో కూడా ఎంతో సహకారం అందించేవారు. నాకోసం కొన్నిసార్లు పరీక్షలు వాయిదావేసేవారు. లేదంటే నేను తిరిగి వచ్చినప్పుడు పరీక్ష రాయడానికి అనుమతించేవారు. స్కూల్లో సంవత్సరం సిలబస్‌ అంతా 20రోజుల్లోనే పూర్తిచేసేదాన్ని.

మీరు సాధించిన పతకాల్లో అత్యంత సంతోషాన్ని ఇచ్చింది ఏది?
ఈషా: ఈ సంవత్సరం జరిగిన జూనియర్‌ ప్రపంచకప్‌ పోటీల్లో నేను వెండి పతకం సాధించడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది.

ఇప్పుడిప్పుడే షూటింగ్‌ క్రీడను ఎంచుకున్న వారికి ఇచ్చే సలహలు,సూచనలు ?
ఈషా: షూటింగ్‌ అనే కాదు ఏ క్రీడలోనైనా కష్టపడితే తప్పకుండా విజయం సాధించవచ్చు. మీరు ఆడే ఆటలో ఉత్తమ ప్రదర్శన ఇవ్వండి. విజయం అదే వస్తుంది.

భవిష్యత్‌లో మీ లక్ష్యం ఏమిటి ?
ఈషా: నా ముందున్న ఏకైక లక్ష్యం ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించడమే.

 

 



Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.