
తాజా వార్తలు
బ్యాట్స్‌మెన్ బాధ్యత తీసుకోవాలంటున్న ఆర్సీబీ ఆటగాడు మొయిన్ అలీ
ముంబయి: స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ ఆడితేనే మ్యాచులు గెలవలేమని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్‌రౌండర్ మొయిన్ అలీ అంటున్నాడు. వారిద్దరిపై జట్టు ఎక్కువగా ఆధారపడొద్దని సూచిస్తున్నాడు. దిగ్గజ క్రికెటర్లు ఎందరో ఉన్నప్పటికీ ఆర్సీబీ ఇప్పటి వరకు ట్రోఫీ గెలవలేదు. ప్రతిసారీ ‘ఈసారి కప్పు మనదే’ అంటూ రావడం నిరాశతో వెనుదిరడగం సర్వసాధారణంగా మారింది. 2016లో మాత్రం ఆ జట్టు రన్నరప్‌గా నిలిచింది. 2020 సీజన్ కోసం బెంగళూరు 13 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది. తిరిగి తీసుకున్న ఇద్దరు విదేశీ ఆటగాళ్లలో అలీ ఒకరు. తమ జట్టు ట్రోఫీ గెలవాలంటే ఇతర ఆటగాళ్లు బాధ్యత తీసుకోవాలని అతడు అంటున్నాడు.
‘మాకు శుభారంభం అవసరం. మేమెప్పుడూ నిదానంగా జోరందుకుంటాం. ముఖ్యంగా సొంతమైదానంలో మేం ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే చిన్నస్వామి వికెట్ చాలా బాగుంటుంది. బౌండరీ సరిహద్దులు చిన్నవి. ఇది బౌలర్లను భయపెడుతుంది. మ్యాచులు గెలిచేందుకు మేం ప్రతిసారీ విరాట్, ఏబీ డివిలియర్స్‌పై ఆధారపడకూడదు. నాతో సహా కొత్తగా వచ్చే బ్యాటర్లు బాధ్యత తీసుకోవాలి. చక్కగా బ్యాటింగ్ చేయాలి’ అని మొయిన్ అలీ అన్నాడు. గతేడాది నిరాశపరిచిన గ్రాండ్‌హోమ్, హెట్‌మైయిర్, స్టాయినిస్ సహా 11 మందిని బెంగళూరు ఈ సారి విడుదల చేసింది.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అరలీటర్ వాటర్ బాటిల్ రూ.60 ఇదేం న్యాయం?
- పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
- పునర్నవికి ఝలక్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్
- దర్శకుల్ని ఎంపిక చేయడమే కష్టమైంది
- సౌదీలో ఇక రెస్టారెంట్లలో ఒకే క్యూ..
- సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో...
- ఆ ‘ఈగ’ పరమ అసహ్యంగా ఉంది!
- గాంధీ ఆస్పత్రికి దిశ నిందితుల మృతదేహాలు
- మరోసారి వండర్ ఉమెన్ సాహసాలు చూశారా?
- శ్వేతసౌధంలో ఏకాకి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
