close

తాజా వార్తలు

కిదాంబి, సమీర్‌ శుభారంభం

గ్వాంగ్జు: కొరియా మాస్టర్స్‌లో భారత్‌కు శుభారంభం లభించింది. మాజీ ప్రపంచ నంబర్‌వన్‌ కిదాంబి శ్రీకాంత్‌, యువ షట్లర్‌ సమీర్‌ వర్మ పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్లోకి ప్రవేశించారు. ఆరోసీడ్‌గా బరిలోకి దిగిన శ్రీకాంత్‌ 21-18, 21-17 తేడాతో వాంగ్‌ వింగ్‌ కి విన్సెంట్‌ (హాంకాంగ్‌)ను వరుస గేముల్లో చిత్తుచేశాడు. కేవలం 37 నిమిషాల్లో అతడిని ఓడించాడు. వీరిద్దరూ ఇప్పటి వరకు 14 మ్యాచుల్లో తలపడగా కిదాంబి 11-3తో తిరుగులేని ఆధిక్యంతో ఉన్నాడు. తర్వాతి రౌండ్లో జపాన్‌ షట్లర్‌ కంటా సునెయామతో తలపడతాడు.

సమీర్‌ వర్మ తొలి గేమ్‌లో 11-8తో ఆధిక్యంలో ఉండగా ప్రత్యర్థి కజుమస సకాయ్‌ (జపాన్‌) మ్యాచ్‌ నుంచి మధ్యలోనే వైదొలిగాడు. దీంతో భారత షట్లర్‌ నేరుగా రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. తన సోదరుడు సౌరభ్‌ను 21-13, 12-21, 13-21 తేడాతో ఓడించిన స్థానిక ఆటగాడు కిమ్‌ డాంగున్‌తో సమీర్‌ తర్వాతి మ్యాచ్‌లో తలపడనున్నాడు. ఈ టోర్నీలో భారత్‌ నుంచి మహిళా ప్రాతినిధ్యం లేదు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.