
తాజా వార్తలు
ముంబయి: గులాబి టెస్టు నిర్వహణలో ప్రమాణాల పరంగా ఎక్కడా రాజీపడొద్దని టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ అన్నారు. భారత్, బంగ్లా తొలి డే/నైట్ టెస్టు ముగిసిన తర్వాత అన్ని విషయాలను సమీక్షించుకోవాలని సూచించారు. అభిమానులను తిరిగి మైదానాలకు రప్పించేందుకే సుదీర్ఘ ఫార్మాట్‌కు ‘పింక్ బంతి’ని అదనంగా జోడించారని పేర్కొన్నారు. చారిత్రక గులాబి టెస్టుకు ఈడెన్ గార్డెన్స్ సిద్ధమైన సంగతి తెలిసిందే.
‘కొత్త ప్రయోగాలు అవసరమే. ఆ తర్వాత మ్యాచ్ ఎలా సాగిందో సమీక్షించాలి. మంచు ఎంత కురిసింది, ఆట ప్రమాణాల ప్రకారం సాగిందా, రాజీ పడ్డారా వంటివి విశ్లేషించుకోవాలి. గులాబి బంతితో ప్రయోజనాలూ, ప్రమాదాలూ ఉన్నాయి. మ్యాచ్ ఆరంభమైన తర్వాత బంతి తడిచి మ్యాచ్‌పై ప్రభావం చూపిస్తే ఏం చేయాలో ఆలోచించుకోవాలి. మంచు కురిసి మ్యాచ్ ప్రమాణాల ప్రకారం సాగకపోయినా మాట్లాడుకోవాలి’ అని సచిన్ అన్నారు.
‘కొత్త ప్రయోగాలు చేపట్టాలని మనమందరం కోరుకుంటున్నాం. ఇది విజయవంతం అవుతుందో లేదో చూడాలి. స్టేడియంలోకి ఎంతమంది వచ్చారన్న దానిపై విజయం ఆధారపడదు. అది కేవలం ఓ అంశం మాత్రమే. సాధారణంగా గట్టిగా, పచ్చికతో ఉండే పిచ్‌పై గులాబి బంతితో స్పిన్నర్లు రాణించలేరని కొందరు భావిస్తున్నారు. గతేడాది భారత్.. ఆస్ట్రేలియాకు వెళ్లినప్పుడు పేసర్లకు అనుకూలించిన పెర్త్ పిచ్‌పై నేథన్ లైయన్ అదరగొట్టాడు. ప్రస్తుతం భారత పేసర్లు అద్భుతంగా ఆడుతున్నారు. వారి సీమ్ పొజిషన్ చాలా బాగుంది. నిలకడగా మంచి ప్రాంతాల్లో బంతులు వేస్తున్నారు. ఫిట్నెస్ బాగుండటంతో ఎక్కువ బౌలింగ్ చేయగలుగుతున్నారు. ప్రస్తుతం ఏ జట్టూ సుదీర్ఘంగా బ్యాటింగ్ చేయడం లేదు. రోజున్నర కన్నా ఎక్కువ ఆడటం ఈ మధ్య నేను చూడలేదు’ అని తెందూల్కర్ వెల్లడించారు.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- ఎన్‌కౌంటర్‌పై సీపీఐ నారాయణ క్షమాపణ
- విచారణ ‘దిశ’గా...
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- ఘోర అగ్ని ప్రమాదం..43 మంది మృతి
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- కొడితే.. సిరీస్ పడాలి
- పెళ్లే సర్వం, స్వర్గం
- ‘శరద్ పవార్ కొన్ని విషయాలు దాచారు’
ఎక్కువ మంది చదివినవి (Most Read)
