
తాజా వార్తలు
ముంబయి: భారత్, వెస్టిండీస్ తొలి టీ20పై నీలిమబ్బులు కమ్ముకున్నాయి. మ్యాచ్ వేదికను ముంబయి నుంచి మరో చోటుకు తరలించాలని ఎంసీఏను స్థానిక పోలీసులు కోరుతున్నారట. మ్యాచ్కు నిర్వహణకు సరిపడా భ్రదతా సిబ్బందిని కేటాయించలేకపోవడమే ఇందుకు కారణమని తెలిసింది. షెడ్యూలు ప్రకారం డిసెంబర్ 6న వాంఖడేలో మ్యాచ్ జరగాలి. అది బాబ్రీ మసీద్ కూల్చివేసిన దినం. అయోధ్యపై తీర్పు వచ్చిన తర్వాత మొదటిసారి కాబట్టి ఎలాంటి అల్లర్లు జరగకుండా నగరంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. దాంతోపాటు డిసెంబర్ 6న బాబాసాహెబ్ అంబేడ్కర్ వర్ధంతి. దీనిని వేలాది మంది ‘మహాపరినిర్వాణ్ దివస్’గా జరుపుకుంటారు.
ఈ రెండు కార్యక్రమాలకు వేల సంఖ్యలో బలగాలను నగరంలో మోహరించాల్సి ఉంటుంది. దాంతో మ్యాచ్ నిర్వహణకు అవసరమైన భద్రతా సిబ్బందిలో కేవలం 25 శాతం మందిని మాత్రమే కేటాయించగలమని పోలీసులు ముంబయి క్రికెట్ సంఘానికి వెల్లడించారట. సాధారణంగా ముంబయిలో అంతర్జాతీయ మ్యాచ్ భద్రతకు 1200 పోలీసులు, 300 ట్రాఫిక్ పోలీసులు అవసరం. పరిస్థితిపై మరింత వివరంగా చర్చించేందుకు ఎంసీఏ అధికారులు శుక్రవారం నగర పోలీసు కమిషనర్ సంజయ్ బార్వ్ను కలవాలని భావిస్తున్నారు. సరిపడా పోలీసులు లేనప్పుడు సొంత ఖర్చులతో ప్రైవేటు రక్షణ సిబ్బందితో భద్రత ఏర్పాట్లు చేసుకోవడం గురించి ఆయనకు విజ్ఞప్తి చేయనున్నారు. అప్పటికీ అంగీకరించకపోతే డిసెంబర్ 6 మ్యాచ్ను హైదరాబాద్కు, 11న అక్కడ జరగాల్సిన మ్యాచ్ను ముంబయికి తరలించాలని భావిస్తున్నారట.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- ఎన్కౌంటర్పై సీపీఐ నారాయణ క్షమాపణ
- విచారణ ‘దిశ’గా...
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- ఘోర అగ్ని ప్రమాదం..43 మంది మృతి
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- కొడితే.. సిరీస్ పడాలి
- పెళ్లే సర్వం, స్వర్గం
- ‘శరద్ పవార్ కొన్ని విషయాలు దాచారు’
ఎక్కువ మంది చదివినవి (Most Read)
