
తాజా వార్తలు
బ్రిస్బేన్: పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్(150 బ్యాటింగ్; 257 బంతుల్లో 10x4) శతకం నమోదు చేశాడు. గబ్బా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పాక్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటున్నాడు. కాగా, ఇంగ్లాండ్‌లో ప్రపంచకప్ తర్వాత యాషెస్ సిరీస్‌లో ఘోరంగా విఫలమైన ఈ విధ్వంసకర బ్యాట్స్‌మన్ పాకిస్థాన్‌పై ఆచితూచి ఆడుతున్నాడు. ఈ క్రమంలో టెస్టుల్లో 22వ శతకం పూర్తి చేసుకున్నాడు. 18 ఇన్నింగ్స్‌ల తర్వాత వార్నర్ శతకం చేయడం ఇదే తొలిసారి.
యాషెస్ సిరీస్‌లో మొత్తం పది ఇన్నింగ్స్‌లు ఆడిన ఆస్ట్రేలియన్ ఓపెనర్ 2,8,3,5,61,0,0,0,5,11 వరుస పరుగులివి. హెడింగ్లీలో మాత్రమే అర్ధశతకం(61) చేశాడు. ఆ సిరీస్ మొత్తం 9.5 సగటుతో 95 పరుగులు మాత్రమే చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. మరోవైపు పాకిస్థాన్ గురువారం తొలి ఇన్నింగ్స్‌లో 240 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
- హ్యాట్సాఫ్ టు కేసీఆర్: జగన్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- లింగాపూర్ బాధితురాలి పేరు 'సమత'గా మార్పు
- ఏంలేదు..వాతావరణంపై మాట్లాడుకున్నాం..
- అతను నా తండ్రి కాదు: హేడెన్ వాల్ష్
- సభాపతిది అతి జోక్యం: చంద్రబాబు
- వైకాపాలో చేరిన గోకరాజు సోదరులు
- గాంధీ ఆస్పత్రికి దిశ నిందితుల మృతదేహాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
