close

తాజా వార్తలు

తొలి వికెట్‌ కోల్పోయిన భారత్

కోల్‌కతా: చారిత్రక డే/నైట్‌ టెస్టులో భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. అల్‌అమిన్‌ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించిన మయాంక్‌ అగర్వాల్‌ (14) మెహదీ చేతికి చిక్కాడు. ప్రస్తుతం టీమ్‌ఇండియా 5 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 26 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్‌ శర్మ (11*), ఛెతేశ్వర్‌ పుజారా ఉన్నారు. టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకే కుప్పకూలింది. ఇషాంత్‌ శర్మ (5/22) ధాటికి బంగ్లా ఫ్లడ్‌లైట్లలో బ్యాటింగ్‌ చేయకుండానే చాపచుట్టేసింది. ప్రస్తుతం ఫ్లడ్‌లైట్లలో గులాబీ బంతితో భారత బ్యాట్స్‌మెన్‌ అసలైన పరీక్ష ఎదుర్కొంటున్నారు. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.