close

తాజా వార్తలు

అఫ్గాన్‌పై వెస్టిండీస్‌ ఘన విజయం

లఖ్‌నవూ: అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో వెస్టిండీస్‌ తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రెండో రోజు ఓవర్‌నైట్‌ స్కోరు 109/7తో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన అఫ్గాన్ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయింది. విండీస్ సారథి జేసన్ హోల్డర్‌ (3/20) ధాటికి 120 పరుగులకే కుప్పకూలింది. అనంతరం 31 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ వికెట్‌ కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్‌లో పది వికెట్లతో అఫ్గాన్‌ పతనాన్ని శాసించిన విండీస్‌ బాహుబలి కార్న్‌వాల్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ దక్కింది. తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు పడగొట్టిన అతడు రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీశాడు. ఈ విజయంతో వెస్టిండీస్‌ జట్టు అరుదైన రికార్డు సాధించింది. భారత్‌లో ఫీల్డింగ్ ఎంచుకుని గెలిచిన మూడో పర్యాటక జట్టుగా రికార్డు సృష్టించింది. 1969, 2001లో ఆసీస్‌ మాత్రమే బౌలింగ్‌ ఎంచుకొని విజయాలు సాధించాయి. 

స్కోరు వివరాలు:
అఫ్గాన్‌ తొలి ఇన్నింగ్స్‌: 187 ఆలౌట్‌ (జావేద్‌ 39, కార్న్‌వాల్‌ 7/75)
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌: 277 ఆలౌట్‌ (బ్రూక్స్‌ 111, అమిర్‌ 5/74)
అఫ్గాన్ రెండో ఇన్నింగ్స్‌: 120 ఆలౌట్‌ (జావేద్ 62, ఛేజ్‌ 3/10)
వెస్టిండీస్‌ రెండో ఇన్నింగ్స్‌: 33/1 (క్యాంప్‌బెల్ 19*, అమిర్ 1/5) 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.