
తాజా వార్తలు
ఇద్దరి మధ్య ఘర్షణ.. ఒకరికి గాయాలు
నాగోలు, న్యూస్టుడే: తన ఇంటి ఎదురుగా కుక్క మూత్ర విసర్జన చేసిందని ఆగ్రహోదగ్రుడైన ఓ వ్యక్తి.. దాని యజమాని తలపై శిరస్త్రాణంతో కొట్టి గాయపరిచిన సంఘటన ఎల్బీనగర్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. శివగంగానగర్లో నివసించే దాసరి అంజయ్య(27)కు చెందిన పెంపుడు కుక్కకు ఇటీవల జబ్బు చేసింది. డిసెంబర్ 29న ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు ఆటోను పిలిపించాడు. ఆటోలో ఉన్న దుమ్మును డ్రైవరు శుభ్రం చేస్తుండగా... ఆ శునకం పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలంలో మూత్ర విసర్జన చేసింది. ఆ రోడ్డు అవతల ఎదురింట్లో ఉండే రాములు అనే వ్యక్తి ఇది గమనించి గట్టిగా అరుస్తూ బయటికి వచ్చాడు. తన ఇంటిముందు అపరిశుభ్రం చేశావంటూ అంజయ్యను దూషించి ఆగ్రహంతో దాడిచేశాడు. చేతిలోని శిరస్త్రాణంతో గట్టిగా మోదడంతో తలకు తీవ్రగాయమైంది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు ఆదివారం రాత్రి నిందితుడిపై 324, 504, 506 సెక్షన్లతోపాటు రెడ్ విత్ 34 ఐపీసీ చట్టాల కింద కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టిన యువకుడు
- ఏపీ సచివాలయం వద్ద డ్రోన్ కలకలం..
- 8 మంది.. 8 గంటలు
- నాడు గొంతు కోశాడు నేడు ప్రాణం తీసుకున్నాడు
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- ఆనమ్ మీర్జా మెహందీ వేడుకలో సానియా తళుకులు
- నాకు సంబంధం ఉందని తేలితే ఉరేసుకుంటా
ఎక్కువ మంది చదివినవి (Most Read)
