
తాజా వార్తలు
అరకులోయ, న్యూస్‌టుడే: ఆంధ్రాఊటీ అరకులోయ పరిసరాల్లో హీరో ఆలీ, హీరోయిన్ రిషిత జంటగా నటిస్తున్న ‘పండుగాడి ఫొటో స్టూడియో’ సినిమా చిత్రీకరణ శుక్రవారం జరిగింది. దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ.. ఈ సినిమాని మూడు రోజులుగా అరకులోయ పరిసరాల్లో మంచు అందాల నడుమ చిత్రీకరిస్తున్నామన్నారు. ప్రస్తుతం పాట చిత్రీకరణ జరుగుతోందన్నారు. అరకులోయలో చిత్రీకరణ తర్వాత తెనాలిలో కొద్ది రోజులు షూటింగ్ ఉంటుందన్నారు. ఈ సినిమాలో జీవా, శ్రీలక్ష్మి, సుధ, అన్నపూర్ణమ్మ, దేవిశ్రీ, టీనా చౌదరి, వినోద్‌కుమార్ నటిస్తున్నారని చెప్పారు.
Tags :