close

తాజా వార్తలు

ఈవీఎంలపై అపోహలు అవాస్తవం: రజత్‌కుమార్‌

తనపై కాంగ్రెస్‌ చేసిన ఆరోపణలపై స్పందించనని వెల్లడి

హైదరాబాద్‌: ఈవీఎంల పనితీరుపై అపోహలు అవాస్తవమని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్ తోసిపుచ్చారు. సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని తేల్చి చెప్పిందని గుర్తు చేశారు. ఇటీవల జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ట్యాంపరింగ్ జరిగిందనడం పూర్తిగా అవాస్తమని, దీనిపై వివాదం అనవసరమని తేల్చిచెప్పారు. ట్యాంపరింగ్ జరిగిందని.. ఆధారాలతో నిర్ధరణ చేస్తామని ఎవరైనా ముందుకు వస్తే స్వాగతిస్తామని ప్రకటించారు. తనపై కాంగ్రెస్ పార్టీ చేసిన వ్యాఖ్యలపై స్పందించనని రజత్‌ కుమార్‌ అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఇప్పటి వరకు 16 లక్షల ఓటరు దరఖాస్తులు వచ్చాయని రజత్‌కుమార్ చెప్పారు. గతంలో కూడా 1950 టోల్ ఫ్రీ నంబరు ఉండేదని, సాఫ్ట్‌వేర్‌ మెరుగులు దిద్ది మళ్లీ అందుబాటులోకి తెచ్చామన్నారు. ఆ నంబరుకు ఫోన్ చేసి సమస్యలు, అభ్యంతరాలు, ఫిర్యాదులు చేయొచ్చన్నారు. కేంద్ర మాజీ ఎన్నికల ప్రధాన కమిషనర్ ఓపీ రావత్ ‌సహా తన పేరు హైదరాబాద్‌ నాంపల్లి నియోజకవర్గంలో జాబితాల్లో ఉండటంపై దర్యాప్తునకు ఆదేశించామని సీఈవో స్పష్టం చేశారు. ఈవీఎం, వీవీప్యాట్‌ల వినియోగం ఇప్పటిది కాదని, ఇలా అకస్మాత్తుగా ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.