
తాజా వార్తలు
హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ఈనెలాఖరుకు వస్తుందని, సమయం తక్కువగా ఉన్నందున కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈఎన్నికలు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ- ప్రధాని మోదీ మధ్య జరిగే ఎన్నికలుగా ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేయాలనుకునేవారు ఈనెల 14వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గాంధీభవన్ నుంచి డీసీసీ, మండల, జిల్లా నాయకులతో ఉత్తమ్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాహుల్‌ను ప్రధానమంత్రి చేయడం కోసం అందరూ కష్టపడి పనిచేయాలన్నారు. ప్రధాని మోదీ ఎన్నికల హామీలు అమలు చేయడంలో విఫలమై, మతపరమైన రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15లక్షలు జమ చేస్తామని చెప్పిన మోదీ.. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా వేయలేదన్నారు. రాహుల్ ప్రధాని అయిన తర్వాత రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తారని వివరించారు. ఓటరు జాబితా నుంచి 22లక్షల మంది ఓటర్లను తొలగించారని ఆరోపించారు. ఓటరు జాబితాలో చేరికలు, తొలగింపుపై బూత్‌లెవల్ ఏజెంట్లు అవగాహనతో ఉండాలని ఉత్తమ్ కుమార్‌రెడ్డి సూచించారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
- ఇక ఆ హోటల్‌కి అస్సలు వెళ్లను: రకుల్
- వామ్మో..! రోడ్డుపై ఎంత పే..ద్ద యంత్రమో!!
- పుల్వామా దాడి: పక్కా ప్లాన్
- పాక్‌పై దాడి చేయండి: బలూచ్ పోరాట యోధులు
- బాబుతో విభేదాలపై అశోక్ గజపతి రాజు క్లారిటీ
- దాడికి రావల్పిండి ఆస్పత్రి నుంచే మసూద్ ఆదేశాలు
- ప్రపంచకప్:భారత్-పాక్ మ్యాచ్ జరగడానికి వీల్లేదు
- వేర్పాటువాద నేతలకు భద్రత ఉపసంహరణ
- వీర జవాను కుటుంబానికి అర ఎకరా భూమిస్తా
- ‘పెళ్లికి ముందే బిడ్డను కన్నాను’
ఎక్కువ మంది చదివినవి (Most Read)
