
తాజా వార్తలు
లాస్ఏంజెల్స్: సినీ రంగంలో ఉన్నత స్థానానికి చేరేందుకు నటీనటులు ఎన్నో కష్టాలు పడుతుంటారు. అందులో కొందరే ఆ స్థానానికి చేరుకుంటారు. కానీ చెత్త కుప్పలో దొరికిన ఓ శునకం సడన్‌గా స్టారైపోయింది. పై ఫొటోలో కనిపిస్తున్న శునకానికి అదే ఫ్లాష్‌బ్యాక్ ఉంది. దీని పేరు షెల్బై. టెన్నెసే ప్రాంతానికి 25 మైళ్ల దూరంలో ఉన్న ఓ శివారు ప్రాంతంలో మేగన్ అనే యానిమల్ కంట్రోల్ అధికారికి ఇది దొరికింది. ఆమె అటుగా కారులో వెళుతుండగా చెత్తకుప్పలో షెల్బై కనిపించింది.
ఆ ప్రాంతంలో వాహనాలు మితిమీరిన వేగంతో వెళుతుండడంతో ఆ శునకాన్ని తనతో పాటు యానిమల్ షెల్టర్‌కు తీసుకెళ్లాలనుకుంది మేగన్. ఈ నేపథ్యంలో కేథరిన్, బ్రూస్ కెమెరాన్ అనే ఇద్దరు హాలీవుడ్ రచయితలు శునకానికి సంబంధించిన ఓ సినిమా తీయాలన్న ఉద్దేశంతో ఉన్నారు. కథను కూడా సిద్ధం చేసుకున్నారు. కానీ సినిమాకు సరిపోయే శునకం వారికి దొరక్క వెతికే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో యానిమల్ షెల్టర్‌లో ఉన్న షెల్బై గురించి ఆ రచయితలకు తెలిసింది.
దాంతో షెల్బైను ప్రధాన పాత్రలో పెట్టి ఓ సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ట్రైనర్లను నియమించి దానికి శిక్షణ కూడా ఇప్పించారు. అలా ‘ఎ డాగ్స్ వే హోమ్’ టైటిల్‌తో సినిమాను తెరకెక్కించారు. ఇందులో షెల్బై పాత్ర పేరు బెల్లా. ఈ ఏడాది జనవరి 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో బెల్లా పాత్రలో నటించిన షెల్బైకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఇప్పుడు ఈ శునకాన్ని వివిధ ఆస్పత్రుల్లో, వృద్ధాశ్రమాల్లో థెరపిస్ట్గానూ ఉపయోగించుకుంటున్నారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- కొల్లగొట్టింది రూ.100కోట్లకు పైనే!
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు
- ‘ఆ విషయంలో రాముడూ గ్యారెంటీ ఇవ్వలేడు’
ఎక్కువ మంది చదివినవి (Most Read)
