close

తాజా వార్తలు

ఉప సభాపతిగా పద్మారావు గౌడ్‌ ఏకగ్రీవఎన్నిక

హైదరాబాద్‌ : తెలంగాణ శాసనసభ ఉపసభాపతిగా పద్మారావు గౌడ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నిక విషయాన్ని సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఈ రోజు శాసన సభ సమావేశాలు ప్రారంభం కాగానే ప్రకటించారు. అనంతరం పద్మారావు గౌడ్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌, సభాపతి అభినందనలు తెలిపారు. నూతన ఉపసభాపతికి మంత్రులు, ఎమ్మెల్యేలు అభినందనలు చెప్పారు. అనంతరం ఆయన్ని సీఎం కేసీఆర్‌, ప్రతిపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు.

అనంతరం కేసీఆర్‌ మాట్లాడుతూ..‘2001లో తెరాస, తెలంగాణ ఉద్యమ ప్రస్థానం ఎడారి ప్రయాణంగా ప్రారంభమైంది. తెరాస ప్రస్థానం ఆరంభం నుంచి పద్మారావు గౌడ్‌ మాతోనే ఉన్నారు. హైదరాబాద్‌లో కల్లు దూకాణాలు మూసివేయవద్దంటూ సమైక్య రాష్ట్రంలో పోరాడారు. మళ్లీ ఆయన ఆబ్కారీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కల్లు దుకాణాల పునరుద్ధరణ జరిగింది. నియోజకవర్గ ప్రజలతో పద్మారావు గౌడ్‌ మమేకమై ఉండి.. వారిపై ప్రేమాభిమానులు చూపించే పద్ధతి చాలా మందిని ఆకట్టుకుంటుంది. ప్రజాజీవితంలో అటువంటి పద్ధతులు అవలంభించడం ద్వారా చాలా గొప్ప పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకోవడంతోపాటు ఎన్నికల్లో అద్భుతమైన విజయాలు సాధించవచ్చని ఆయన నిరూపించారు ’ అని కొనియాడారు.

పద్మారావు గౌడ్‌ హైదరాబాద్‌ కార్పొరేటర్‌గా ప్రజలకు ఎంతో సేవ చేశారని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆయన గతంలో యువజన కాంగ్రెస్‌ నాయకులుగా పనిచేశారని.. ఇందిరాగాంధీ పిలుపునిచ్చిన గరీబ్‌ హఠావో ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.