
తాజా వార్తలు
‘ప్రేమ ఎంతపనైనా చేయిస్తుంది’
కాలిఫోర్నియా: ఓ వ్యక్తి తన పెంపుడు కుక్క కోసం ప్రాణాలకు తెగించాడు. ఎగసిపడుతున్న మంటల్ని దాటుకుని కుక్కను కాపాడారు. ఆయన సాహసానికి నెటిజన్లు ఫిదా అయ్యారు. అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్న జోస్ అనే వ్యక్తి ఇంట్లో మంటలు చెలరేగాయి. ఓ పక్క పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతుంటే.. మరోపక్క అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పుతున్నారు. జోస్ సురక్షితంగా బయటికి వచ్చేశారు. కానీ ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న కుక్క గబానా మాత్రం ఇంట్లోనే ఉండిపోయింది.
జోస్ ఇష్టమైన కుక్కను కాపాడాలనే తాపత్రయంతో ఏ మాత్రం ఆలోచించకుండా లోపలికి వెళ్లి, కాసేపటికి కుక్కతో బయటికి వచ్చారు. ఈ క్రమంలో ఆయన ముఖం, చేతికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనను కొందరు వీడియో తీసి, సోషల్మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం అది వైరల్గా మారింది. జోస్ మంచి మనసును నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. నిజమైన హీరో ఆయనేనని, ప్రేమ ఎంతపనైనా చేయిస్తుందని కామెంట్లు చేశారు.
ఈ ఘటన గురించి జోస్ మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను గబానా కోసం లోపలికి పరిగెత్తుతున్నప్పుడు నాకు ఇంకేం గుర్తుకు రాలేదు. కుక్క అక్కడ ఉందని మాత్రమే తెలుసు. మంటల వల్ల ఏమీ కనిపించలేదు. కానీ కుక్కను మాత్రం ఇంటి నుంచి భద్రంగా బయటికి తీసుకురాగలిగా. అది నా కుటుంబంలో భాగం. మాకంతా అదంటే చాలా ఇష్టం’ అని చెప్పారు.
This shocking cellphone video captures Jose Guzman rushing past firefighters and into his burning home looking frantically for his dog. Just moments later, both of them run out.
— KUSI News (@KUSINews) March 12, 2019
📹: Adam Guzman pic.twitter.com/kqln3v56VN