close

తాజా వార్తలు

వైఎస్‌ వివేకా హత్యపై ఈసీ ఆరా

అమరావతి: వైఎస్‌ వివేకానంద రెడ్డి దారుణ హత్యోదంతంపై ఈసీ ఆరా తీసింది. హత్యకు దారితీసిన కారణాలేంటో తెలుసుకోవాలని కడప జిల్లా ఎస్పీని ఆదేశించింది. ఈ మేరకు ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మతో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జీకే ద్వివేది మాట్లాడారు. శాంతిభద్రతల విషయంలో రాజీపడొద్దని సూచించారు. రాయలసీమలో శాంతి భద్రతలపై ఆయా జిల్లాల ఎస్పీలతో ద్వివేది సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..  శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కర్నూలు జిల్లా మంత్రాలయం ఘటనపైనా నివేదిక కోరారు.

31న కొత్త ఓటర్లందరికీ కార్డులు పంపిణీ
ఈ ఎన్నికలకు సబంధించి ఓటరు నమోదు ప్రక్రయి ముగిసిందని ద్వివేది స్పష్టంచేశారు. నిన్న ఒక్కరోజే 5లక్షల ఫారం-6 దరఖాస్తులు వచ్చాయన్నారు. నవంబర్‌ 1 తర్వాత 37.28 లక్షల ఫారం-6 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఇంకా 11లక్షల దరఖాస్తులు పరిశీలించాల్సి ఉందన్నారు. పత్రాలు సరిగా లేని 3లక్షల దరఖాస్తులను తిరస్కరించినట్టు చెప్పారు. ఈ నెల 25లోగా పరిశీలన పూర్తిచేసి ఓటరు కార్డులుజారీ చేయనున్నట్టు తెలిపారు. కొత్తగా 22.49 లక్షల మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారని వెల్లడించారు. ఈ నెల 26న అనుబంధ ఓటర్లజాబితాను ప్రకటించనున్నట్టు ద్వివేది తెలిపారు. ఈ నెల 31న కొత్త ఓటర్లందరికీ ఓటరు కార్డులను పంపిణీ చేస్తామన్నారు. ఉద్యోగులకు ఈ నెల 28 నుంచి 31 వరకు పోస్టల్‌ బ్యాలెట్‌పై అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న 4లక్షల మంది పోస్టల్‌ బ్యాలెట్‌ వాడుకొనే అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 1 నుంచి 15 వరకు రూ.5.44 కోట్ల విలువైన మద్యం సీజ్‌ చేసినట్టు చెప్పారు. రూ.18లక్షల విలువైన వివిధ రకాల మత్తు పదార్థాలు పట్టుకున్నామన్నారు. మద్యం స్వాధీనం సందర్భంగా 2077 కేసులు నమోదు చేసినట్టు ద్వివేది తెలిపారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.