
తాజా వార్తలు
కేంద్ర మాజీ మంత్రిపై బరిలోకి దిగుతున్న కుమార్తె
పార్వతీపురం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో మరో ఆసక్తికర పోరుకు తెరలేచింది. కుటుంబ సభ్యులే ఒకరిపై ఒకరు పోటీ చేసిన సందర్భాలు కొత్త కాకున్నా.. తాజాగా అరకు పార్లమెంటు స్థానంలో కేంద్ర మాజీ మంత్రి కిశోర్‌చంద్రదేవ్‌పై ఆయన కుమార్తే పోటీపడుతుండటం చర్చనీయాంశమైంది. రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న కిశోర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. కాంగ్రెస్‌ను వీడి ఇటీవలే తెదేపాలోకి వచ్చిన ఆయనకు ఆ పార్టీ అరకు ఎంపీ సీటును కేటాయించింది. ఇన్నాళ్లూ కిశోర్‌కు రాజకీయ వారసురాలిగా భావిస్తున్న ఆయన కుమార్తె శ్రుతీదేవి మాత్రం.. కాంగ్రెస్‌లోనే ఉండిపోయారు. తాజాగా ఆ పార్టీ అరకు పార్లమెంటు స్థానానికి అభ్యర్థిగా శ్రుతీదేవిని ప్రకటించింది. దీంతో తండ్రీ కుమార్తెల మధ్య పోరు తప్పని పరిస్థితి నెలకొంది. పర్యావరణ న్యాయవిద్య (ఎన్విరాన్మెంటల్ లా)ను అభ్యసించిన శ్రుతీదేవి.. గత మూడు ఎన్నికల్లో కిశోర్‌దేవ్ పక్షాన ప్రచార బాధ్యతలు నిర్వహించారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- మాకొద్దీ ఉద్యోగం!
- ఆయనే లోకమన్నది.. అంతలోనే అంతమైంది
- నిత్యానందా.. నీ దేశానికి వీసా ఎలా?
- నోట్లో దుస్తులు కుక్కి వివాహితపై అత్యాచారం
- విండీస్ వీరులారా.. ఓ విన్నపం!
- ఎందుకా పైశాచికం?
- కదులుతున్న కారులోనే లైంగిక దాడి
- ఆ పాట నా ఇమేజ్ను పూర్తిగా మార్చేసింది!
- ‘బుమ్రా నా ముందొక బేబీ బౌలర్’
- ఆలియా మెచ్చిన తెలుగు హీరో..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
