close

తాజా వార్తలు

కాంగ్రెస్‌కు మరో ఇద్దరు సీనియర్లు రాజీనామా

హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్య నేతలు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.  రాజ్యసభ మాజీ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్‌, పీసీసీ ఓబీసీ కమిటీ ఛైర్మన్‌ చిత్తరంజన్‌ దాస్‌ తమ పదవులకు, పార్టీ ప్రాథమిక సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఈ మేరకు వారిద్దరూ ప్రకటనను మీడియాకు విడుదల చేశారు. కాంగ్రెస్‌లో సామాజిక సమానత్వం కొరవడిందని.. సీనియర్‌ నాయకులకు విలువలేదని దాస్‌ ఆరోపించారు. రాజీనామా లేఖలను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి పంపినట్లు నేతలు ప్రకటనలో పేర్కొన్నారు. తమ రాజీనామాలను తక్షణమే ఆమోదించాలని కోరారు. వారిద్దరూ ఏ పార్టీలో చేరేదీ ఇంకా స్పష్టంచేయలేదు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.