close

తాజా వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికలు

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.  ఏపీలో ఒక ఉపాధ్యాయ, రెండు పట్టభద్ర నియోజకవర్గాల్లో, తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్‌ జరిగింది. ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చిన ఓటర్లు ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో ఉత్సాహంగా ఓటేశారు. పట్టభద్రుల ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు సహా ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉత్తరాంధ్రలో ఉపాధ్యాయ, ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు పట్టభద్ర స్థానంతో పాటు మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం, కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్; వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో జరిగిన ఈ ఎన్నికల ఫలితాలు మార్చి 26న విడుదల కానున్నాయి. 

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పట్టభద్రుల నియోజకవర్గంలో 45.95శాతం పోలింగ్‌ నమోదైంది. మెదక్‌- నిజామాబాద్‌ - ఆదిలాబాద్‌ - కరీంనగర్‌ పట్టభద్రుల స్థానానికి 50.03 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. ఉపాధ్యాయ స్థానానికి 83.54శాతం పోలింగ్‌ నమోదైంది. అలాగే, వరంగల్‌ - ఖమ్మం - నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గంలో 89.25శాతం పోలింగ్‌ నమోదైంది.

ఓటేసిన ప్రముఖులు

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పోలకంపాడులో ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల్లో ఆయన ఓటు వేశారు. మంత్రి నారా లోకేశ్‌ పొలకంపాడులోనే  తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే, ఉమ్మడి కరీంనగర్‌లో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఓటు వేశారు. జగిత్యాలలోని పోలింగ్‌ కేంద్రంలో పట్టభద్రుల బరిలో నిలిచిన జీవన్‌ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి నిర్మల్‌లో ఓటు వేశారు. సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మాజీ మంత్రి హరీశ్‌రావు తదితరులు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.