close

తాజా వార్తలు

పవన్‌ వ్యాఖ్యల్ని పరిశీలిస్తాం: రజత్‌కుమార్‌

హైదరాబాద్‌: తెలంగాణలో జరిగే లోక్‌సభ ఎన్నికలకు ఇప్పటివరకు మొత్తం 699 నామినేషన్లు దాఖలైనట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ వెల్లడించారు. నిజామాబాద్‌లో రైతుల నామినేషన్‌ స్వీకరణలో ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని ఆయన తెలిపారు. నిజామాబాద్‌ స్థానానికి 245 నామినేషన్లు దాఖలైనట్టు వెల్లడించిన ఆయన.. అభ్యర్థుల సంఖ్య  90దాటితే బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టంచేశారు. తెలంగాణ పాకిస్థానా.. అంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తామని చెప్పారు. లోక్‌సభ ఎన్నికలకు మొత్తం ఓటర్ల సంఖ్య 2.96కోట్లకు చేరిందని వెల్లడించారు. ఎన్నికల సందర్భంగా నిర్వహించిన తనిఖీల్లో ఇప్పటివరకు 10.09 కోట్ల నగదును సీజ్‌ చేసినట్టు చెప్పారు. రూ.2.04 కోట్ల విలువ చేసే మద్యం, రూ.2.45 కోట్ల విలువచేసే డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. 

ప్రగతిభవన్‌లో రాజకీయ కార్యకలాపాల నిర్వహణకు ఫిర్యాదుపై తెరాసకు లేఖ రాశామని చెప్పారు. కాంగ్రెస్‌ చేసిన ఫిర్యాదుపై ఈసీ ఆదేశాలకనుగుణంగా లేఖ రాసినట్టు తెలిపారు. అధికారిక భవనాల్లో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించరాదని సూచించామన్నారు. సీఎంపై వీహెచ్‌పీ చేసిన ఫిర్యాదు ఉల్లంఘన కిందకు రాదని రజత్‌కుమార్‌ స్పష్టంచేశారు. నిజామాబాద్‌లో రైతుల నామినేషన్ల స్వీకరణలో నిబంధనలు ఉల్లంఘించలేదన్నారు. అన్ని రాజకీయ పార్టీలు స్టార్‌ క్యాంపెయినర్ల జాబితా ఇచ్చాయని చెప్పారు. నామినేషన్ల పరిశీలనకు ఒక్కో అభ్యర్థి తరఫున నలుగురు మాత్రమే హాజరు కావాలని సూచించారు. నామినేషన్ల పరిశీలనకు ఒక్కో అభ్యర్థి తరఫున నలుగురు మాత్రమే హాజరు కావాలన్నారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.