
తాజా వార్తలు
అమరావతి: పోలింగ్ రోజు ఘటనలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది కలెక్టర్లను వివరణ కోరారు. నియోజకవర్గానికి ముగ్గురు ఈవీఎం నిపుణులను కేటాయించినా సేవలను వినియోగించుకోకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. కొన్నిజిల్లాల్లో సాంకేతిక నిపుణులకు రూట్ మ్యాప్‌లు ఇవ్వకపోవడాన్ని సీఈవో ద్వివేది గుర్తించారు. ఎన్నికలకు నాలుగు రోజుల ముందే రాష్ట్రానికి 600 మంది బెల్ ఇంజినీర్లు వచ్చారని, అయినా కలెక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడమేంటని మండిపడ్డారు. సాయంత్రం 6గంటల తర్వాత పోలింగ్‌పై రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించారు. ఉద్దేశపూర్వకంగా తప్పులు చేసినవారిపై కేసులు నమోదు చేస్తామని స్పష్టంచేశారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో కొన్ని కేంద్రాల ఈవీఎంలను ఆర్వో ఆలస్యంగా ఇవ్వడంపైనా నివేదిక కోరారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో మైనర్లు ఓటు వేసిన ఘటనపై నివేదిక పంపాలని ఆ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- విడాకులిప్పించి మరీ అత్యాచారం...
- ఆయేషా మీరా భౌతికకాయానికి ‘రీ-పోస్టుమార్టమ్’..?
- స్నానాల గదిలో సీసీ కెమెరా ఏర్పాటుకు యత్నం
- రివ్యూ: వెంకీ మామ
- బాలీవుడ్ భామతో పంత్ డేటింగ్?
- ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్ విచారణ... పోలీసుశాఖలో అలజడి
- ఇండిగో విమానం 9 గంటల ఆలస్యం
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
- బంజారాహిల్స్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
ఎక్కువ మంది చదివినవి (Most Read)
