close

తాజా వార్తలు

పోలింగ్‌ సరళిపై రేపటి నుంచి తెదేపా సమీక్షలు

అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్‌ సరళిపై తెలుగుదేశం పార్టీ రేపటి నుంచి సమీక్షలు జరపనుంది. రోజుకు రెండు లోక్‌సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలపై సమీక్ష జరపాలని ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 50 మంది పార్టీ నేతలను సమీక్షకు ఆహ్వానిస్తున్నారు. నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు, ఏరియా కోఆర్డినేటర్లు, ఇతర ముఖ్య నేతలు ఈ జాబితాలో ఉన్నారు. రోజుకు 14 అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు సమావేశమవుతారు. ఈసారి సమీక్షలను విజయవాడ-గుంటూరు జాతీయ రహదారిపై మంగళగిరి వద్ద ఉన్న హ్యాపీ రిసార్ట్స్‌లో జరపనున్నారు. ముఖ్యమంత్రి నివాసం వద్ద సమావేశాల నిర్వహణకు ఎన్నికల కోడ్‌ ఆంక్షలు ఉండటంతో స్ధలాన్ని మార్చారు.
ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అప్రమత్తం చేసేందుకు ఈ సమావేశాలను వినియోగించుకోబోతున్నారు. సమావేశాల నిర్వహణ కోసం చేసిన ఏర్పాట్లను తెదేపా జాతీయ సమన్వయ కార్యదర్శి టీడీ జనార్దన్‌, కార్యాలయ కార్యదర్శి రమణ, పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి దారపనేని నరేంద్ర తదితరులు పరిశీలించారు. మరోవైపు సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు.. పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. సీఎం పోలవరం పర్యటన ఖరారైతే ఆ రోజు ఉదయం జరగాల్సిన కాకినాడ లోక్‌సభ నియోజకవర్గ సమీక్ష తేదీలో మార్పు ఉండే అవకాశముందని నేతలు భావిస్తున్నారు. సమీక్షలు జరిగే రోజుల్లో రెండు రోజులపాటు పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు వెళ్లనున్నారు. ఆ రోజుల్లో సమీక్ష సమావేశాలు ఉండవని పార్టీ వర్గాలు తెలిపాయి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.