
తాజా వార్తలు
హైదరాబాద్: సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్పర్సన్ విజయశాంతి ఆందోళన వ్యక్తంచేశారు. ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్ కార్యకర్తల్లో అయోమయం సృష్టించేవిగా ఉన్నాయన్నారు. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చని, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం వస్తే చంద్రబాబుతో పాటు కేసీఆర్, జగన్లు ఆ కూటమికి మద్దతిచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటూ గాంధీభవన్లో నిన్న జగ్గారెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయశాంతి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతున్న తరుణంలో
ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో తెరాసతో అమీతుమీ తేల్చుకుంటామని కాంగ్రెస్ హైకమాండ్, పీసీసీ చీఫ్ ఉత్తమ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెబుతుంటే.. జగ్గారెడ్డి అలా మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. జగ్గారెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్, తెరాసల మధ్య రహస్య అవగాహన కుదిరిందనే అనుమానాలు ప్రజలకు కలిగే అవకాశం ఉందన్నారు. తెరాస, వైకాపా మద్దతు లేకుండా కేంద్రంలో ఏ పార్టీ అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదన్న కేసీఆర్ మాటల్ని జగ్గారెడ్డి విశ్వసిస్తున్నారేమో అనే అనుమానం కలుగుతోందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో ఇలాంటి ప్రకటనలు చేయడం సరికాదని రాములమ్మ అభిప్రాయపడ్డారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- నిర్భయ దోషులకు త్వరలో ఉరి
- భాజపాకు తెరాస షాక్!
- శరణార్థులకు పౌరసత్వం
- ‘అమిత్ షాపై ఆంక్షల్ని పరిశీలించండి’
- లూప్ ఎంతకాలం ఉంచుకోవచ్చు?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
