close

తాజా వార్తలు

ఆ జూలో తోడేళ్ల బోనులో శునకం

చైనా: రకరకాల జంతువులను, పక్షులను చూడాలంటే జంతు ప్రదర్శనశాల(జూ)కు వెళ్లాల్సిందే. సింహాలు, పులులు, ఏనుగులు, జింకలు, తోడేళ్లు ఇలా అనేక వన్య ప్రాణులను మనం చూడవచ్చు. ఇలాగే అనుకుని జూకు వెళ్లి ఓ వ్యక్తికి అనుకోని జంతువు కనిపించింది. అదీ ఎన్‌క్లోజర్‌లో ఉండటంతో అతడి ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

చైనాలోని వూహాన్‌ సిటీలో ఉన్నజ్యుఫింగ్‌ ఫారెస్ట్‌ జూకు ఓ వ్యక్తి వెళ్లాడు. ఒక్కో ఎన్‌క్లోజర్‌లో ఉన్న జంతువును చూసుకుంటూ వెళ్లి, తోడేలు ఉన్న ఎన్‌క్లోజర్‌ ముందు ఆగాడు. దాన్ని చూసి అతడు ఆశ్చర్యపోయాడు. అనుమానంతో ఆ తోడేలును కాసేపు పరీక్షగా చూడగా, అందులో ఉన్నది తోడేలు కాదని, కుక్క అని అర్థమైంది. ఈ విషయాన్ని జూ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, వారి నుంచి వచ్చిన సమాధానం చూసి, ఇంకా ఆశ్చర్యపోయాడు. వాళ్లు ఏం చెప్పారంటే.. 

‘మీరు చూసినట్లు తోడేలు ఎన్‌క్లోజర్‌లోనే కుక్క కూడా ఉంది. ఆ సమయంలో తోడేలు నిద్ర పోతోంది. తోడేలు తోడుగా కుక్కను పెట్టాం. ఎందుకంటే గతంలో ఇతర తోడేళ్లు ఉండగా, ఇది అన్నింటిపైనా దాడి చేసేది. అందుకే ఆ గుంపు నుంచి దీన్ని వేరు చేశాం. అయితే, వేరే ఎన్‌క్లోజర్‌కు మార్చినప్పటి నుంచి ఈ తోడేలు ఒంటరిగా, నిసత్తువతో గడుపుతోంది. అందుకే దానికి తోడు రెండు కుక్కలను ఎన్‌క్లోజర్‌లో పెట్టాం. అయితే, ఒక కుక్కతో ఆ తోడేలు స్నేహంగా ఉండటంతో రెండో కుక్కను బయటకు తీసుకొచ్చాం. ఇప్పుడు ఆ రెండూ కలిసే ఉంటున్నాయి’ అని షాంగైయిస్ట్‌ తన కథనంలో పేర్కొంది. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్‌ అవుతోంది. 
 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.