
తాజా వార్తలు
హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలకు గాను 35 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఓట్ల లెక్కింపులో 20వేల మంది సిబ్బంది పాల్గొంటారని వివరించారు. పోలింగ్ కేంద్రాలు అధికంగా ఉన్న చోట, ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉన్న నియోజకవర్గాల్లో సిబ్బంది సంఖ్యను పెంచామన్నారు. ఈ నెల 23 సాయంత్రం లోపే ఫలితాలు ప్రకటిస్తామని రజత్‌కుమార్ స్పష్టంచేశారు. 17 నియోజకవర్గాలకు మొత్తం మూడు వేల టేబుళ్లు ఏర్పాటు చేస్తామని, ఒక్కో టేబుల్‌కు నలుగురు సిబ్బంది ఉంటారని చెప్పారు.
అభ్యర్థులు ఎక్కువగా ఉన్నందున నిజామాబాద్‌లో ఒక్కో టేబుల్‌కు ఆరుగురు సిబ్బంది ఉంటారని వివరించారు. ఎక్కువ ఓటర్లున్న మల్కాజ్‌గిరిలో అదనపు టేబుళ్లు ఏర్పాటు చేస్తామని సీఈవో తెలిపారు. ఇప్పటికే సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదు వీవీప్యాట్లకు సంబంధించిన స్లిప్పులు లెక్కిస్తామన్న ఆయన.. స్లిప్పులు లాటరీ తీసి ఐదు వీవీప్యాట్ యంత్రాలు ఎంపిక చేస్తామన్నారు. ఫలితాలకు సాధారణం కంటే రెండు గంటల అదనపు సమయం పట్టవచ్చని.. సాయంత్రం లోపే పూర్తి ఫలితాలు రావచ్చని రజత్ కుమార్ అభిప్రాయపడ్డారు. పోలింగ్ తరహాలో ఓట్ల లెక్కింపు కూడా ప్రశాంతంగా నిర్వహిస్తామని వెల్లడించారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- టీమిండియా సమష్టి విజయం
- భార్యతో మళ్లీ పెళ్లి, ఆమె చెల్లి మెడలో తాళి
- ఏపీలో దిశ యాక్ట్:అత్యాచారం చేస్తే ఉరిశిక్షే
- ఓ సారి ఆలోచన చేయండి: ప్రశాంత్ కిషోర్
- పాస్‌పోర్ట్‌పై కమలం చిహ్నం?
- పౌరసత్వ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- యడియూరప్పకు భాజపా ప్రశంసలు..
- రఘురామ కృష్ణరాజువిందుకు రాజ్‌నాథ్‌సింగ్
- దిల్లీ వెళ్లాలంటేనే భయమేస్తోంది: ఏపీ గవర్నర్
- రూ.200 పెట్టి ఫస్ట్‌షో చూడండి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
