close

తాజా వార్తలు

సీఈసీతో చంద్రబాబు భేటీ

దిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) సునీల్ అరోడాతో తెదేపా జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజవర్గంలోని 5 పోలింగ్‌ కేంద్రాల్లో ఈ నెల 19న రీపోలింగ్‌ వ్యవహారాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. రీపోలింగ్‌కు సీఈసీ ఆదేశాల వెనుక కారణాలేంటి? రీపోలింగ్‌కు ఆదేశాలు ఇచ్చేముందు ఆయే అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నారు? ఎన్నికలు పూర్తైన చాలా రోజుల తర్వాత సీఈసీ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందనే విషయాన్ని ఆయన లేవనెత్తే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఎన్నికల సంఘం అనుసరిస్తున్న విధానాలను కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించనున్నారు.

ఇప్పటివరకు మొత్తం 6 దశల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ప్రతి దశలోనూ బెంగాల్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ తదితర చోట్ల చాలా ఫిర్యాదులు వచ్చాయి. వీటన్నింటినీ పక్కన పెట్టి ఏపీలో వైకాపా అభ్యర్థులు ఇచ్చిన ఫిర్యాదులపైనే ఈసీ ఎందుకు చర్యలు తీసుకుంటోందని సీఈసీని చంద్రబాబు ప్రశ్నించే అవకాశముంది.

ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు వివిధ రాజకీయ పార్టీల ముఖ్య నేతలతో సమావేశమవుతారు. ఈ నెల 23 నిర్వహించతలపెట్టిన విపక్ష పార్టీల సమావేశానికి ఏయే పార్టీలకు ఆహ్వానాలు పంపాలనే అంశంపై చర్చించే అవకాశముంది. కాంగ్రెస్‌ అధినాయకత్వంలో చంద్రబాబు చర్చలు జరిపే అవకాశముంది. ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌, ఎల్‌జేడీ అధినేత శరద్‌ యాదవ్‌, దిల్లీ సీఎం కేజ్రీవాల్‌, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వంటి జాతీయ నేతలతో చంద్రబాబు భేటీ కానున్నారు. దిల్లీ నుంచి చంద్రబాబు లఖ్‌నవూ వెళ్లి మాయావతితో భేటీ కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే కాంగ్రెస్‌ అగ్రనాయకత్వంతో విడిగా భేటీ అయ్యే అవకాశముంది. అక్కడి నుంచి లఖ్‌నవూ వెళ్లి బీఎస్పీ అధినేత్రి మాయావతితో చంద్రబాబు భేటీ కానున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.