Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 100004
            [news_title_telugu_html] => 

లోక్‌సభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఈసీ జప్తు

[news_title_telugu] => లోక్‌సభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఈసీ జప్తు [news_title_english] => EC seizures worth Rs 3439 crore from across the country [news_short_description] => సార్వత్రిక ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకుంది. శుక్రవారం సాయంత్రంతో చివరి విడత ఎన్నికల ప్రచారానికి తెరపడగా.. ఆదివారం పోలింగ్‌ జరగనుంది. ఇక ఫలితాలే తరువాయి. అయితే [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-18 10:30:40 [news_isactive] => 1 [news_status] => 2 ) )
లోక్‌సభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఈసీ జప్తు - EC seizures worth Rs 3439 crore from across the country - EENADU
close

తాజా వార్తలు

లోక్‌సభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఈసీ జప్తు

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకుంది. శుక్రవారం సాయంత్రంతో చివరి విడత ఎన్నికల ప్రచారానికి తెరపడగా.. ఆదివారం పోలింగ్‌ జరగనుంది. ఇక ఫలితాలే తరువాయి. అయితే తాజా ఎన్నికల్లో ఈసీ చరిత్రాత్మక, అసాధారణ నిర్ణయాలు తీసుకోవడమే గాక.. రికార్డు స్థాయిలో నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకుంది. 

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా దేశవ్యాప్తంగా చేపట్టిన తనిఖీల్లో ఇప్పటివరకు రూ. 3,439కోట్ల నగదు, ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఈసీ వెల్లడించింది. లోక్‌సభ ఎన్నికల్లో ఇంత భారీ స్థాయిలో జప్తు చేయడం ఇదే తొలిసారి. 2014 ఎన్నికల సమయంలో రూ. 1,200కోట్ల నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

ఇక అత్యధికంగా తమిళనాడులో రూ. 950కోట్ల నగదు, ఇతర వస్తువులను జప్తు చేయగా.. గుజరాత్‌లో రూ.552 కోట్లు, దిల్లీలో రూ.426 కోట్ల నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఇప్పటివరకు పార్టీలు, నేతలపై దాదాపు 500 ఫిర్యాదులు వచ్చినట్లు ఈసీ తెలిపింది. ప్రధాని మోదీపై కూడా కొన్ని ఫిర్యాదులు రాగా.. ఆయన కోడ్‌ ఉల్లంఘించలేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

కీలక నిర్ణయాలు, అసాధారణ ప్రకటనలు..

ఈ ఎన్నికల్లో ఈసీ కొన్ని అసాధారణ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. తమిళనాడులోని వేలూరు నియోజకవర్గంలో ఓటర్లను ఆకర్షించేందుకు భారీగా నగదు పంచుతున్నారని తేలడంతో తొలిసారిగా ఆర్టికల్‌ 324 కింద ఉన్న అధికారాలను ఉపయోగించి అక్కడ ఎన్నికను రద్దు చేసింది. ఇక పశ్చిమబెంగాల్‌లో చోటుచేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఎన్నికల ప్రచార గడువును ఒక రోజు తగ్గిస్తూ అసాధారణ నిర్ణయాన్ని ప్రకటించింది. 

వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నందుకు గానూ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, యూపీ మాజీ సీఎం మాయావతి, ఎస్పీ నేత ఆజాంఖాన్‌, కాంగ్రెస్‌ నేత నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూలపై కొన్ని రోజుల పాటు ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్‌పై విమర్శలు రావడంతో ఆ సినిమా విడుదలను నిలిపివేసింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.