Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 102400
            [news_title_telugu_html] => 

తెలంగాణలో తెరాస లెక్క తప్పింది!

[news_title_telugu] => తెలంగాణలో తెరాస లెక్క తప్పింది! [news_title_english] => election results in telangana [news_short_description] => తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో తెరాస లెక్క తప్పింది. రాష్ట్ర ప్రజలు విభిన్నమైన తీర్పు ఇచ్చారు. తెరాసకు అధిక స్థానాలు కట్టబెడుతూనే భాజపా, కాంగ్రెస్‌ను ఆదరించారు... [news_tags_keywords] => trs, congress, bjp, loksabha elections [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/rRfo4vNO9Sg [news_videoinfo] => |https://www.youtube.com/embed/rRfo4vNO9Sg [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-24 01:40:03 [news_isactive] => 1 [news_status] => 2 ) )
తెలంగాణలో తెరాస లెక్క తప్పింది! - election results in telangana - EENADU
close

తాజా వార్తలు

తెలంగాణలో తెరాస లెక్క తప్పింది!

ప్రజల విభిన్న తీర్పు.. భాజపా అనూహ్య గెలుపు

హైదరాబాద్‌: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో తెరాస లెక్క తప్పింది. 16 స్థానాలు సాధించడమే లక్ష్యంగా ఎంతో శ్రమించిన ఆ పార్టీకి కొంత నిరాశ కల్గిస్తూ రాష్ట్ర ప్రజలు విభిన్నమైన తీర్పు ఇచ్చారు. తెరాసకు అధిక స్థానాలు కట్టబెడుతూనే భాజపా, కాంగ్రెస్‌ను ఆదరించారు. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాల్లో తెరాస 9, భాజపా 4, కాంగ్రెస్‌ 3, ఎంఐఎం ఒక్క స్థానంలో గెలుపొందాయి. 2014 ఎన్నికల్లో తెరాసకు 11 స్థానాలు రాగా.. తాజా ఎన్నికల్లో రెండు స్థానాల్ని కోల్పోయింది. శాసనసభకు జరిగిన ముందస్తు ఎన్నికల పోరులో చతికిలపడిన కాంగ్రెస్‌ మూడు పార్లమెంట్‌ స్థానాల్ని కైవసం చేసుకొని ఊపిరి పీల్చుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో 100 స్థానాలకు పైగా ధరావతు కోల్పోయిన భాజపా అనూహ్యంగా పుంజుకొని తెరాస కంచుకోటల్ని దెబ్బకొట్టింది. మెదక్‌, నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్‌, వరంగల్‌, మహబూబాబాద్‌, జహీరాబాద్‌, ఖమ్మం, పెద్దపల్లి, చేవెళ్ల నియోజకవర్గాల్లో తెరాస విజయకేతనం ఎగురవేయగా.. మల్కాజ్‌గిరి, భువనగిరి, నల్గొండలో కాంగ్రెస్‌ విజయ దుందుభి మోగించింది. కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, సికింద్రాబాద్‌లలో కమలం వికసించింది. హైదరాబాద్‌లో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్‌ ఒవైసీ విజయం సాధించారు. తెరాస ప్రతిష్ఠాత్మకంగా భావించిన నిజామాబాద్‌లో ఆ పార్టీ సిట్టింగ్‌ అభ్యర్థి, సీఎం కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత ఓటమిపాలయ్యారు. ఆ నియోజకవర్గం పరిధిలో తెరాస ఆధిపత్యమే ఉన్నా.. ఆమెను విజయం వరించకపోవడం గమనార్హం.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.