Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 102676
            [news_title_telugu_html] => 

విజేతలకు ప్రశంస.. పరాజితులకు ఓదార్పు 

[news_title_telugu] => విజేతలకు ప్రశంస.. పరాజితులకు ఓదార్పు  [news_title_english] => kcr phone calls to Winners and losers [news_short_description] => పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులతో పాటు అందుకు కృషిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌, పార్టీ [news_tags_keywords] => kcr,trs,ts news,general elections 2019 [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-24 06:50:26 [news_isactive] => 1 [news_status] => 2 ) )
విజేతలకు ప్రశంస.. పరాజితులకు ఓదార్పు  - kcr phone calls to Winners and losers - EENADU
close

తాజా వార్తలు

విజేతలకు ప్రశంస.. పరాజితులకు ఓదార్పు 

తెరాస అధినేత కేసీఆర్‌ ఫోన్లు

ఈనాడు, హైదరాబాద్‌: పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులతో పాటు అందుకు కృషిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అభినందనలు తెలిపారు. వరంగల్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూలు, పెద్దపల్లి, మెదక్‌, మహబూబాబాద్‌, చేవెళ్ల, ఖమ్మం, జహీరాబాద్‌, స్థానాల్లో విజయం సాధించడంతో.. అభ్యర్థులను, మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, శ్రీనివాస్‌గౌడ్‌, నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌లను వారు ప్రశంసించారు. ప్రధానంగా మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాలోని రెండు స్థానాల్లో సత్తా చాటారని అభ్యర్థులు శ్రీనివాస్‌రెడ్డి, రాములును సీఎం కొనియాడారు. భారీ మెజారిటీతో గెలిచిన పసునూరి దయాకర్‌, కొత్త ప్రభాకర్‌రెడ్డి, నామా నాగేశ్వరరావు, కవిత, రంజిత్‌రెడ్డి, నేతకాని వెంకటేశ్‌, బీబీ పాటిల్‌లను మెచ్చుకున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులకు సీఎం ఫోన్‌ చేశారు. ఆయన వినోద్‌తో పాటు కవిత, బూర నర్సయ్యగౌడ్‌, తలసాని సాయి కిరణ్‌, రాజశేఖర్‌రెడ్డిలతో మాట్లాడారు. ఓటమికి కుంగిపోవద్దని చెప్పారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌.. సోదరి కవిత నివాసానికి వెళ్లి మాట్లాడారని తెలిసింది. ఒడిశా శాసనసభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన బిజద అధ్యక్షుడు నవీన్‌ పట్నాయక్‌కు కేసీఆర్‌, కేటీఆర్‌లు ఫోన్ల ద్వారా శుభాకాంక్షలందించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.