Array
(
  [0] => stdClass Object
    (
      [news_id] => 102841
      [news_title_telugu_html] => 

ఈ ‘షా’.. కింగ్‌మేకర్‌..!

[news_title_telugu] => ఈ ‘షా’.. కింగ్‌మేకర్‌..! [news_title_english] => amit shah king maker [news_short_description] => షా.. అంటే రాజు. కానీ ఈ షా మాత్రం కింగ్‌ మేకర్‌! షా అంటే చదరంగంలో చెక్‌మేట్‌ అని అర్థం. కానీ, మన దేశ రాజకీయాల్లో ప్రత్యర్థులకు ఓటమి అని అర్థం. భారత రాజకీయాల్లో అమిత్‌షా  గురించి పలురకాలుగా చెప్పుకొంటారు. అమిత్‌ నమ్మిన సిద్ధాంతాన్ని బలంగా ఆచరిస్తారు. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => || [news_videoinfo] => || [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-24 17:05:04 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఈ ‘షా’.. కింగ్‌మేకర్‌..! - amit shah king maker - EENADU
close

తాజా వార్తలు

ఈ ‘షా’.. కింగ్‌మేకర్‌..!

ఆధునిక రాజకీయాల్లో అపర చాణుక్యుడు. 
- ఆయన వ్యూహాల్లో చిక్కుకొని కొమ్ములు తిరిగిన నేతలే విలవిల్లాడిపోయారు. 
భేషజాలు లేని వ్యక్తి. 
- కార్యకర్తలకు దగ్గరగా ఉంటూ పార్టీ సభ్యత్వాలను 11 కోట్లు దాటించారు. 
కష్టాల్లో అవకాశాలను వెదుక్కొనే ఆశావాది. 
- గుజరాత్‌ నుంచి నిషేధానికి గురై దిల్లీలో ఉన్నప్పుడు మోదీని ప్రధాని అభ్యర్థిగా పార్టీ ఎంపిక చేయడంలో కీలక పాత్ర పోషించారు. 
అలుపెరుగని కార్యదక్షుడు.
- అత్యంత కఠినమైన ఉత్తరప్రదేశ్‌లో తానే స్వయంగా రంగంలోకి దిగి పార్టీని విజయతీరాలకు చేర్చారు.  

షా.. అంటే రాజు. కానీ ఈ షా మాత్రం కింగ్‌ మేకర్‌! షా అంటే చదరంగంలో చెక్‌మేట్‌ అని అర్థం. కానీ, మన దేశ రాజకీయాల్లో ప్రత్యర్థులకు ఓటమి అని అర్థం. భారత రాజకీయాల్లో అమిత్‌షా  గురించి పలురకాలుగా చెప్పుకొంటారు. అమిత్‌ నమ్మిన సిద్ధాంతాన్ని బలంగా ఆచరిస్తారు. ఆయన పార్టీ సిద్ధాంతాలనూ, కార్యకర్తలనూ గౌరవించడం.. కార్యాలయాలను పవిత్రంగా ఉంచడం వంటి వాటిని బలంగా నమ్ముతారు. తనను భగవద్గీత, గాంధేయ వాదం బలంగా ప్రభావితం చేశాయని చెబుతుంటారు. 1964లో అనిల్‌-కుసుమ్‌బెన్‌ షా దంపతులకు షా జన్మించారు. వీరిది సంపన్న కుటుంబం. అమిత్‌ బీఎస్సీ బయో కెమిస్ట్రీ పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచి అమిత్‌ షా ఆధ్యాత్మక కార్యకలాపాల్లో  చురుగ్గా పాల్గొనేవారు. ఆయన 1980ల్లో ఉత్తర ప్రదేశ్‌కు చెందిన స్వామి వామ్‌దేవ్‌ ప్రభావంతో ఆర్‌ఎస్‌ఎస్‌లో చురుగ్గా పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన అహ్మదాబాద్‌లోని నరన్‌పురా శాఖకు తరచూ వస్తుండేవారు. అప్పుడు తొలిసారి నరేంద్ర మోదీతో పరిచయం అక్కడే ఏర్పడింది. 

షా జీవితంలో వెలుగునీడలు..

అది 1983. ఏబీవీపీలో చేరిన షా మరో మూడేళ్లకు భాజపాలో చేరారు. పార్టీ యువ విభాగాల్లో చురుగ్గా పనిసి, జనరల్‌ సెక్రటరీ స్థాయికి ఎదిగారు. 1991 లోక్‌సభ ఎన్నికల్లో అడ్వాణీ ప్రచార బాధ్యతలను అన్నీ తానై చూసుకొన్నారు. 1995లో  గుజరాత్‌లో భాజపా ప్రభుత్వం ఏర్పడటానికి బాటలు పరిచారు. ఈ క్రమంలో ఆయన తన మిత్రుడు, పార్టీ రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ నరేంద్ర మోదీతో కలిసి పనిచేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అసంతృప్తిగా ఉన్న సుమారు 8 వేల మంది కాంగ్రెస్‌ ద్వితీయ శ్రేణి నాయకుల్ని భాజపా వైపు మళ్లించారు.   మోదీ కృషితో... స్టేట్‌ ఫైనాన్సియల్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ అయ్యారు. 1995లో గుజరాత్‌లో మోదీ ప్రాబల్యం పెరిగిపోతోందని ముఖ్యమంత్రి శంకర్‌సిన్హ్‌ వాఘేలా అనుమానించారు. మోదీని దిల్లీలో పార్టీ కార్యకలాపాలను చూసేందుకు సాగనంపారు. ఈ దశలో మోదీకి రాష్ట్ర విషయాలను షా తెలియజేసేవారు. 1997లో మోదీ అమిత్‌షాకు ఎమ్మెల్యే టికెట్‌ ఇప్పించారు. అప్పటి నుంచి షా వెనుదిరిగి చూడలేదు. 2001లో మోదీ వ్యతిరేకి శంకర్‌సింహ్‌ వాఘేలాను తప్పించేందుకు షా లాబీయింగ్‌ చేసి విజయం సాధించారు. దాంతో మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు.  2002 అసెంబ్లీ ఎన్నికల్లో అమిత్‌షా లక్షన్నర ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మరోసారి మోదీ అధికారం చేపట్టగానే షాకు కీలకమైన హోంశాఖతో సహా 12 శాఖలను కట్టబెట్టారు. ఆ తర్వాత ప్రభుత్వంలో నెంబర్‌ 2గా ఎదిగారు.  అదే ఏడాది, సోహ్రాబుద్దీన్‌ కేసులో షాను సీబీఐ అరెస్టు చేసింది. కొన్నాళ్లకే బెయిల్‌ వచ్చినా,  గుజరాత్‌లో అడుగుపెట్టకూడదని కోర్టు ఆదేశించింది. కొంతకాలం దిల్లీలోని గుజరాత్‌ భవన్‌లో తలదాచుకున్నారు. తరవాత సుప్రీం అనుమతితో తిరిగి గుజరాత్‌లో అడుగుపెట్టారు. 
ఆ తరవాత పరిణామాలు వేగంగా చోటు చేసుకొన్నాయి. మోదీని ప్రధాని అభ్యర్థిగా భాజపా ప్రకటించింది. యూపీ ప్రచార బాధ్యతలను అమిత్‌షాకు అప్పగించారు. సోషల్‌ ఇంజినీరింగ్‌లో షాను మించిన వారు లేరు. 2014 ఎన్నికల కోసం పార్టీ ఉత్తరప్రదేశ్‌ ప్రచార బాధ్యతలను 2013లో అమిత్‌షాకు కట్టబెట్టారు. ప్రధాని అభ్యర్థి మోదీ కూడా అక్కడి నుంచే బరిలోకి దిగనున్నారు. ఈ క్రమంలో ఆయన ఉత్తరప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతాలను సైతం సందర్శించారు. రిజర్వేషన్ల విషయంలో యాదవ రహిత ఓబీసీల్లో ఉన్న అసంతృప్తిని, సమాజ్‌ వాదీ పార్టీ పట్ల ప్రజల్లోని ఆగ్రహాన్ని ఆయన భాజపాకు అనుకూలంగా తీర్చిదిద్దారు. అమిత్‌షాలో రాజకీయ భేషజాలు కనిపించవు. పార్టీ విజయానికి అవసరం అనుకుంటే ఎంత చిన్న పార్టీతో అయినా పొత్తుపెట్టుకొంటారు. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్‌లో పలు చిన్న పార్టీలు భాజపాతో జట్టుకట్టేలా చేశారు. ఈ వ్యూహానికి మోదీ ఇమేజీ తోడవ్వడంతో 73సీట్లను భాజపా గెలుచుకొంది. అదే ఊపు కొనసాగి అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పతాకం రెపరెపలాడింది. ఈ ఎన్నికల్లో ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అమిత్‌ షా’ అంటూ ప్రధాని కితాబు ఇచ్చారంటే ఆయన పాత్రను అర్థం చేసుకోవచ్చు. 

2014లో అమిత్‌షా తొలిసారి భాజపా జాతీయ పార్టీ అధ్యక్ష బాధ్యతల్ని చేపట్టారు. 2016లో ఇదే పదవికి మరోసారి ఎన్నికయ్యారు. ఆయన తొలి టర్మ్‌లో పార్టీ మహారాష్ట్ర, హర్యానా, జమ్ముకశ్మీర్‌, జార్ఖండ్‌, అసోంలలో గణనీయమైన ఫలితాలను సాధించింది. షా సారథ్యంలో పార్టీ మణిపూర్‌ వంటి ఈశాన్య రాష్ట్రాల్లో కూడా పాగావేసింది. త్రిపురలో కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలుకొట్టింది. నాగాలాండ్‌, మేఘాలయాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది.

పార్టీ కార్యకర్తలతో కలిసి పనిచేయడానికి షా బాగా ఇష్టపడతారు. తనతో కలిసి పనిచేసే మిత్రులను, శ్రేయోభిలాషులను, కార్యకర్తలను పేరుపేరునా గుర్తుపడతారు. ఆయన హయాంలో భాజపాలో ఎన్నో మార్పులు చోటు చేసుకొన్నాయి. పార్టీ ఆఫీస్‌ బేరర్లతో కలిసి ఆయన దిల్లీలోని  ప్రధాన కార్యాలయంలో అందుబాటులోనే ఉంటారు. పార్టీ పగ్గాలు చేపట్టిన కొన్ని నెలల్లోనే 640 జిల్లాలో కార్యాలయాలను ఏర్పాటు చేశారు. అమిత్‌ షా పై ఆరెస్సెస్‌ ప్రభావం చాలా ఎక్కువ. అలాగే చాలామంది రాజకీయ నాయకులతో పోలిస్తే అమిత్‌షా విలాసాలకు ఆమడ దూరం. ఎన్నికలప్పుడు తప్ప మిగతా సమయాల్లో ఛార్టర్డ్‌ విమానాలు, హెలికాప్టర్లను పెద్దగా వినియోగించరు. రోడ్డు మార్గంలో ప్రయాణించడాన్నే ఇష్టపడతారు. ‘పాలకులు విలాసాలకు అలావాటు పడితే పనులు చేయలేరనే’ చాణక్య నీతిని ఆచరిస్తారు. చాలామంది రాజకీయ నేతల్లాగా తన చుట్టూ ఒక కోటరీ నిర్మించుకొని దాని మధ్యలో పనిచేయడానికి ఇష్టపడరు. ఆయన నేరుగా కార్యకర్తలతో మమేకమవుతారు. గుజరాత్‌లో అమిత్‌షాతో కలిసి పనిచేసిన  కార్యకర్తల వద్ద ఇప్పటీకీ ఆయన వ్యక్తిగత ఫోన్‌ నెంబర్‌ ఉంటుది. వారు ఫోన్‌ చేస్తే ‘హా, అమిత్‌’ అంటూ సుదీర్ఘ సంభాషణ మొదలుపెడతారు.

2019 ఎన్నికలకు బాటలు..

2019 ఎన్నికల కోసం షా ప్రతిపక్షాల కంటే వేగంగా పావులు కదిపారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌, ప్రాంతీయ పార్టీలు కలిసి మహా కూటమిగా ఏర్పడతాయని ప్రచారం జరిగింది. తీరా ఎన్నికలొచ్చాక పొత్తులతో అన్నికంటే అతిపెద్ద కూటమిగా ఎన్‌డీఏనే నిలిచింది. ప్రతిపక్ష కూటమి దాని ముందు వెలవెలబోయింది. పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌, కమ్యూనిస్టుల  ప్రాబల్యం తగ్గినట్లు షా గమనించారు. భాజపా ఇక్కడ నాలుగు ఐదు స్థానాల నుంచి ప్రధాన ప్రత్యర్థి స్థాయికి చేరింది. అదే సమయంలో మమత ప్రభుత్వం శాంతి భద్రతల విషయంలో విఫలమైందనే భావన రాణిగంజ్‌, మాల్డా, బస్రిత్‌, దులఘర్‌, అసన్‌సోల్‌, ఇతర ప్రాంతాల్లో నెలకొంది. రోహింగ్యాల విషయంలో మమత ఉదాసీన వైఖరి కారణంగా స్థానికుల్లో అసంతృప్తి పెరిగిపోయింది. ఫలితంగా పంచాయత్‌, జిల్లాపరిషత్‌ ఎన్నికల్లో భాజపా దాదాపు 6వేల స్థానాలను గెలుచుకొంది. ఈ ప్రభుత్వ వ్యతిరేకత కచ్చితంగా తమకు లాభిస్తుందని షా అంచనా వేశారు. నేరుగా ఆయనే రంగంలోకి దిగి అక్కడ పార్టీ కేడర్‌ను నిర్మించారు.   
ఇక బిహార్‌లో, 2015  అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు వ్యతిరేకంగా నిలిచిన జనతాదళ్‌ (యూ), ఆర్‌జేడీ, కాంగ్రెస్‌ల కూటమిని ఈ ఎన్నికలకు ముందు విడగొట్టారు. ఇక్కడ భాజపాకు ఇప్పటికే 24.4శాతం ఓట్‌ షేర్‌ ఉంది. దీనికి జేడీయూకు చెందిన 16.8శాతం ఓట్‌ షేరు కలిస్తే విజయం సాధించవచ్చనేది అమిత్‌ ఫార్ములా. దీనికి తోడు బిహార్‌ వంటి పెద్ద రాష్ట్రంలో నితీష్‌ వంటి ఇమేజ్‌ ఉన్న నాయకుడితో పొత్తు ఉంటే ఎన్నికలను సులభంగా గెలవచ్చన్న విషయం షాకు బాగా తెలుసు. దీంతో కొంత పట్టువిడుపు ధోరణితో జేడీయూతో పొత్తు కుదుర్చుకున్నారు. దీని ఫలితం.. ఇక్కడి ప్రచార బాధ్యతలను నితీష్‌ ముందుండి నడిపించారు. దీంతో మోదీ ప్రశాంతంగా పశ్చిమబెంగాల్‌, యూపీ, ఒడిశా, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లపై దృష్టి పెట్టగలిగారు. 
2014 ఎన్నికల వరకు తెరవెనుక వ్యూహకర్తగా ఉన్న అమిత్‌ షా 2019 ఎన్నికలు వచ్చేసరికి ప్రధాన ప్రచారకర్తగా మారిపోయారు. దేశ వ్యాప్తంగా 1,60,000 కిలోమీటర్లు ప్రయాణించి 161 బహిరంగ సభలు, 18 రోడ్‌షోలు, 1,500  పార్టీ కార్యకర్తల సమావేశాల్లో ప్రసంగించారు. 312 లోక్‌సభ స్థానాల్లో ఆయన పర్యటించారు. ఉత్తరప్రదేశ్‌లో ఉప ఎన్నికల ఫలితాలు రాష్ట్రప్రభుత్వం పై అసంతృప్తికి చిహ్నంగానే షా గుర్తించారు. ఇది జాతీయ స్థాయికి వచ్చేసరికి ఎస్పీ, బీఎస్పీ కూటమి ఓటర్లలో చాలా మంది భాజపా, మోదీ మంచి ఆప్షన్‌గా భావిస్తున్న విషయాన్ని షా గుర్తించారు. అందుకే మోదీ ప్రచారం ఎక్కువగా యూపీపై కేంద్రీకరించేలా చేశారు. మొత్తం మీద భాజపా చరిత్రలో అత్యంత విజయవంతమైన అధ్యక్షుడిగా అమిత్‌ షా నిలిచారు.

షా విజయ రహస్యాలు..

* పార్టీ ఎప్పుడు విజయం సాధించినా అది తన విజయంగా ఎక్కడా చెప్పుకోరు. మొత్తం క్రెడిట్‌ బూత్‌స్థాయి కార్యర్తలకే చెందుతుందని అంటారు. తన నిర్ణయాలపై పార్టీ నడవదని.. సమష్టి తత్వంతోనే పార్టీ నడుస్తుందని స్పష్టం చేస్తారు. విజయాల వెనుకే మాస్టర్‌మైండ్‌గా ఉండటానికి ఇష్టపడతారు. 
* పార్టీని పునాదుల స్థాయి నుంచి నిర్మించుకుంటూ వస్తారు. కింది స్థాయి కేడర్‌ విలువ అమిత్‌షాకు తెలిసినంతగా మరే నాయకుడికి తెలియదు. అందుకే కేడర్‌తో మమేకమవుతారు. స్వయంగా స్థానిక సమావేశాలను నిర్వహిస్తారు. 
* ప్రత్యర్థి పార్టీల నేతలను ఆకర్షించడంలో షా దిట్ట. అసోమ్‌లో హేమ్‌నాథ్‌ బిస్వ శర్మ వంటి నేతలను భాజపాలో చేర్పించారు. హర్యానా, మహారాష్ట్ర, యూపీ... ఇలా చెప్పుకొంటూ పోతే షా చాణక్యానికి  లొంగని రాష్ట్రం లేదనే చెప్పాలి. 
* కార్యర్తలను చేర్పించడంపై షా చాలా ఆసక్తి చూపుతారు. పార్టీకి ఎంత ఎక్కువగా కార్యకర్తలు ఉంటే.. అంతకు కొన్ని రెట్ల ఓట్లు పార్టీకి లభిస్తాయని నమ్ముతారు. అందుకే భాజపా కార్యకర్తల సంఖ్య షా హయాంలో 11 కోట్లను దాటిపోయింది. 
* ప్రచారం విషయంలోనూ షా అలుపెరుగరని యోధుడు. ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలప్పుడు షా ఒక్కరే 100 ర్యాలీలు నిర్వహించారు. 
- ఇంటర్నెట్‌డెస్క్‌  ప్రత్యేకం


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.