close

తాజా వార్తలు

వైకాపా శాసనసభా పక్ష భేటీ ప్రారంభం

అమరావతి: వైకాపా శాసనసభాపక్ష సమావేశం ఉదయం 10:31 గంటలకు ప్రారంభమైంది. శాసనసభాపక్ష నేతగా  జగన్‌మోహన్‌రెడ్డిని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. ఈ సమావేశానికి వైకాపా ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. తాడేపల్లిలో జగన్‌ క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో జగన్‌ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటూ తీర్మానించనున్నారు. ఈ తీర్మాన ప్రతిని సాయంత్రం నాలుగున్నరకు హైదరాబాద్‌లో రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌కు సమర్పించనున్నారు. ఎమ్మెల్యేల బృందంతో కలిసి వెళ్లి జగన్‌ గవర్నర్‌కు ఈ ప్రతిని అందజేయనున్నారు.

శాసనసభాపక్షం సమావేశమైన వెంటనే ఉదయం 11:30 గంటలకు వైకాపా పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. పార్టీ అధ్యక్షుడు జగన్‌ నేతృత్వంలో జరగనున్న ఈ భేటీలో పార్టీ పార్లమెంటరీ పక్ష నేతను ఎన్నుకోనున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.