
తాజా వార్తలు
భువనగిరి: పీసీసీ అధ్యక్ష పదవిపై తనకు ఆశ లేదని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పార్లమెంట్లో పోరాడటమే లక్ష్యమని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. పీసీసీ పదవి కన్నా ప్రజలు తనపై ఉంచిన బాధ్యతలే ముఖ్యమని చెప్పారు. ఆ పదవిపై ఎవరికైనా ఉత్సాహం ఉంటే వారికే ఇవ్వమని చెబుతానన్నారు. గతంలో ప్రతిపక్షంలో పనిచేసిన దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తానని కోమటిరెడ్డి పేర్కొన్నారు. పార్టీలకతీతంగా గెలిచిన ఎంపీటీసీ, జడ్పీటీసీలకు శుభాకాంక్షలు చెప్పారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ కార్యకర్తలకు ఇబ్బందులు కలిగించాలని ఎవరైనా ప్రయత్నిస్తే ఊరుకోబోమని.. కార్యకర్తల కోసం ఎంతటివారితోనైనా పోరాడతానని కోమటిరెడ్డి చెప్పారు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- మాకొద్దీ ఉద్యోగం!
- ఆయనే లోకమన్నది.. అంతలోనే అంతమైంది
- నిత్యానందా.. నీ దేశానికి వీసా ఎలా?
- నోట్లో దుస్తులు కుక్కి వివాహితపై అత్యాచారం
- విండీస్ వీరులారా.. ఓ విన్నపం!
- ఎందుకా పైశాచికం?
- కదులుతున్న కారులోనే లైంగిక దాడి
- ఆ పాట నా ఇమేజ్ను పూర్తిగా మార్చేసింది!
- ‘బుమ్రా నా ముందొక బేబీ బౌలర్’
- ఆలియా మెచ్చిన తెలుగు హీరో..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
