close

తాజా వార్తలు

కొనసాగుతున్న భట్టి ఆమరణ దీక్ష

హైదరాబాద్‌: తెలంగాణలో సీఎల్పీ విలీనాన్ని వ్యతిరేకిస్తూ తాజా మాజీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన ఆమరణదీక్ష రెండోరోజూ కొనసాగుతోంది. ఇందిరాపార్క్‌ సమీపంలోని ధర్నాచౌక్‌ వద్ద కొనసాగుతున్న ఈ దీక్షావేదిక వద్దకు పలువురు నేతలు వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. ఆదివారం ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌, ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి శైలజానాథ్‌, ఎమ్మెల్యే పొడెం వీరయ్య, ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ, చెరుకు సుధాకర్‌ తదితరులు భట్టి విక్రమార్కకు మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ రేపటి నుంచి శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తామని చెప్పారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడితే నష్టపోయేది బలహీనవర్గాలేనన్నారు. సీఎం కేసీఆర్‌ అనుసరిస్తున్న విధానాలు సరికాదని మందకృష్ణ విమర్శించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.