Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 111081
            [news_title_telugu_html] => 

తెరాసలో సీఎల్పీ విలీనం రాజ్యాంగ బద్ధమే

[news_title_telugu] => తెరాసలో సీఎల్పీ విలీనం రాజ్యాంగ బద్ధమే [news_title_english] => clp merge issue [news_short_description] => సీఎల్పీని తెరాసలో విలీనం చేయడం రాజ్యాంగ బద్ధమేనని కాంగ్రెస్‌ నుంచి తెరాసలో చేరిన 12 మంది ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. తెరాస కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో... [news_tags_keywords] => clp,trs,ts politics [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/gep9PwjRhsM [news_videoinfo] => |https://www.youtube.com/embed/gep9PwjRhsM [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-12 12:55:44 [news_isactive] => 1 [news_status] => 2 ) )
తెరాసలో సీఎల్పీ విలీనం రాజ్యాంగ బద్ధమే - clp merge issue - EENADU
close

తాజా వార్తలు

తెరాసలో సీఎల్పీ విలీనం రాజ్యాంగ బద్ధమే

పార్టీ మారిన ఎమ్మెల్యేలు రేగ, గండ్ర

హైదరాబాద్‌: సీఎల్పీని తెరాసలో విలీనం చేయడం రాజ్యాంగ బద్ధమేనని కాంగ్రెస్‌ నుంచి తెరాసలో చేరిన 12 మంది ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. తెరాస కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీని విభేదించి తెరాసలో చేరాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. గ్రూపు రాజకీయాలు, నాయకత్వ లేమితో కాంగ్రెస్‌ కొట్టుమిట్టాడుతోందన్నారు. భవిష్యత్‌పై భరోసా లేకే పార్టీ మారామని, అవసరమైతే రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం..సీఎల్పీని విలీనం చేయాలని కోరామని, చట్ట ప్రకారం విలీనం జరిగినా ఇప్పటి వరకు తెరాస కండువా కప్పుకోలేదన్నారు. పదవుల కోసం చిల్లర మల్లరగా తిడితే ఊరుకునేది లేదని, పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఇటీవ జరిగిన పరిషత్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఒక్క జడ్పీ పీఠాన్ని కూడా కైవసం చేసుకోలేక పోయిందని ఎద్దేవా చేశారు.    
 మరో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ..నియోజకవర్గం అభివృద్ధి, ప్రజల ఆకాంక్ష మేరకే తాము పార్టీ మారామని వివరించారు.‘‘2014 నుంచి ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ ఘోరంగా ఓడిపోతోంది. వరుస ఓటముల తర్వాత కూడా కాంగ్రెస్‌ నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవడం లేదు. ఎంతో మంది నేతలు పార్టీ మారుతున్నా.. ఉత్తమ్‌ వ్యవహారశైలి మారటం లేదు. మాపై అనవసర విమర్శలు చేస్తే కాంగ్రెస్‌ నేతలపై పరువునష్టం దావా వేస్తాం. మొన్నటి వరకు ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరుగుతోందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. బ్యాలెట్‌ పద్ధతిలో జరిగిన ఎన్నికల్లోనూ తెరాస ఘన విజయం సాధించింది. ఈనెల 6కంటే ముందు మేము కాంగ్రెస్‌లో చేరలేదు. ఈనెల6న ఒకే సారి 12 మంది ఎమ్మెల్యేలం తెరాసలో చేరాం.’’ అని వివరించారు. ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, సబితా ఇంద్రారెడ్డి, ఆత్రం సక్కం, సుధీర్‌రెడ్డితో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా సమావేశంలో పాల్గొన్నారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.