Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 112943
            [news_title_telugu_html] => తెలంగాణ ద్రోహులకు ఉద్యోగాలిస్తున్నారు:లక్ష్మణ్‌
            [news_title_telugu] => తెలంగాణ ద్రోహులకు ఉద్యోగాలిస్తున్నారు:లక్ష్మణ్‌
            [news_title_english] => BJP Laxman Comments on Kcr
            [news_short_description] => ప్రధాని అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్‌ సమావేశానికి సీఎం కేసీఆర్‌ వెళ్లకపోవడం రాష్ట్ర ప్రజల దురదృష్టమని తెలంగాణ భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్‌ 

            [news_tags_keywords] => Laxman,BJP,Ts Politics
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => ||
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-06-17 01:04:42
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
తెలంగాణ ద్రోహులకు ఉద్యోగాలిస్తున్నారు:లక్ష్మణ్‌ - BJP Laxman Comments on Kcr - EENADU
close

తాజా వార్తలు

తెలంగాణ ద్రోహులకు ఉద్యోగాలిస్తున్నారు:లక్ష్మణ్‌

హైదరాబాద్‌: ప్రధాని అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్‌ సమావేశానికి సీఎం కేసీఆర్‌ వెళ్లకపోవడం రాష్ట్ర ప్రజల దురదృష్టమని తెలంగాణ భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్‌ విమర్శించారు. కేసీఆర్‌ కుమార్తె, ఆప్తుల్ని భాజపా ఓడించడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఆదివారం  భాజపా కార్యాలయంలో లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడారు. రైతుబంధు పథకం పెట్టి.. దీర్ఘకాలిక సమస్యలను కేసీఆర్‌ పట్టించుకోవడం లేదని ఆక్షేపించారు.

పాఠశాలల్లో అధిక ఫీజుల వసూలుతో పాటు నిరుద్యోగ సమస్యపై ఉద్యమబాట పడతామని లక్ష్మణ్ వెల్లడించారు. అనేక విద్యాసంస్థల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడంలేదని, తెలంగాణ ద్రోహులకు రాజకీయంగా ఉద్యోగాలు కల్పిస్తున్నారని మండిపడ్డారు. మానసిక సంఘర్షణతో ఉన్న యువతకు భాజపా అండగా ఉంటుందన్నారు. ఈ నెల 18న విద్యార్థుల తల్లిదండ్రులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. 19, 20 తేదీల్లో ప్రైవేటు పాఠశాలల ఎదుట ఆందోళనలు చేపడతామని లక్ష్మణ్‌ వివరించారు. జులై 6 నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టి.. డిసెంబర్ వరకు సంస్థాగతంగా బూత్‌ స్థాయి నుంచి కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.