Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 113241
            [news_title_telugu_html] => 

రజనీ తోడుంటే... విజయం మనవెంటే

[news_title_telugu] => రజనీ తోడుంటే... విజయం మనవెంటే [news_title_english] => bjp wants to coalition with rajini [news_short_description] => లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాట ఓటమిపై భాజపా రాష్ట్ర నాయకత్వం డివిజన్ల స్థాయిలో నిర్వహిస్తున్న అంతర్గత సమీక్ష సమావేశాల్లో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో పొత్తు వ్యవహారం తెరపైకి వచ్చింది. ఆయన తోడుంటే భవిష్యత్తు ఎన్నికల్లో తమ పార్టీకి రాష్ట్రంలో విజయం సునాయసమేనని పలువురు నిర్వాహకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. [news_tags_keywords] => rajini kant,bjp,tamilnadu [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-17 08:33:54 [news_isactive] => 1 [news_status] => 2 ) )
రజనీ తోడుంటే... విజయం మనవెంటే - bjp wants to coalition with rajini - EENADU
close

తాజా వార్తలు

రజనీ తోడుంటే... విజయం మనవెంటే

భాజపా నిర్వాహకుల ధీమా

‘తలైవర్‌’తో పొత్తుకు ఆకాంక్ష

అంతర్గత సమీక్షల్లో నేతల అభిప్రాయం

చెన్నై, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాట ఓటమిపై భాజపా రాష్ట్ర నాయకత్వం డివిజన్ల స్థాయిలో నిర్వహిస్తున్న అంతర్గత సమీక్ష సమావేశాల్లో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో పొత్తు వ్యవహారం తెరపైకి వచ్చింది. ఆయన తోడుంటే భవిష్యత్తు ఎన్నికల్లో తమ పార్టీకి రాష్ట్రంలో విజయం సునాయసమేనని పలువురు నిర్వాహకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన ఈ సమీక్షల్లో పలువురు నేతలు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. దీంతో అన్ని డివిజన్ల అంతర్గత సమీక్షలు ముగిసిన తర్వాత దిల్లీలోని అధిష్ఠానానికి రాష్ట్ర నాయకత్వం నివేదిక పంపనుంది. అందులో రజనీకాంత్‌తో పొత్తు వ్యవహారాన్ని ప్రముఖంగా ప్రస్తావించనుందని సమాచారం. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అన్నాడీఎంకే- భాజపా కూటమి ఘోర పరాజయానికి కారణాలను గుర్తించి విశ్లేషించడానికి డివిజన్ల స్థాయిలో అంతర్గత సమీక్షలు నిర్వహించి నివేదిక పంపాలంటూ రాష్ట్ర శాఖను అధిష్ఠానం ఆదేశించింది. ఆ మేరకు ఈ నెల 7న చెన్నై, 8న కాంచీపురంలో ఈ సమీక్షలు జరిగాయి. ఇందులో తమ పార్టీ అభ్యర్థుల ఓటమికి పలు కారణాలను భాజపా నిర్వహకులు ఏకరవు పెట్టారు. భాజపా అభ్యర్థుల విజయానికి అన్నాడీఎంకే నిర్వాహకులు, కార్యకర్తలు సక్రమంగా సహకరించలేదని ప్రధానంగా ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత డీఎంకే విజయానికి బాటలు పరిచిందని అభిప్రాయపడ్డారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మూడో కూటమి ఏర్పాటు చేసి పొందిన ఓట్లనే ప్రస్తుతం అన్నాడీఎంకే కూటమిలో ఉంటూ సాధించామని ప్రస్తావించారు. అవినీతి నిర్మూలన ప్రధాన అజెండాగా పాలన సాగిస్తున్న భాజపా రాష్ట్రంలో మాత్రం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అన్నాడీఎంకేతో కూటమి ఏర్పాటు చేయడాన్ని ప్రజలు ఆమోదించలేదన్నారు. శశికళ కుటుంబంతో పాటు ప్రస్తుత పాలకులపై ఉన్న అవినీతి ఆరోపణలపై తగిన చర్యలు తీసుకోవడానికి కేంద్రంలోని భాజపా ప్రభుత్వం పక్షపాత వైఖరి అవలంభిస్తున్నట్లు రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. ఇవన్నీ ఎన్నికల్లో భాజపా ఓటమికి కారణమయ్యాయని వివరించారు.

ద్రవిడ పార్టీలతో కూటమి వద్దు

రాష్ట్రంలో భాజపా తన ఉనికిని చాటుకుని బలమైన రాజకీయాలకు గట్టి పునాది వేయడానికి పలు అంశాలను ఈ సమావేశాల్లో నిర్వాహకులు సూచించారు. అందులో... అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ద్రవిడ పార్టీలతో భవిష్యత్తులో ఎన్నికల కూటమి ఏర్పాటు చేయకూడదని, అలాగే అవినీతి ఆరోపణలు ఎదుర్కొనే రాష్ట్ర పాలకులపై తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. తమిళనాడులో తామరం వికసించాలంటే ఆధ్యాత్మిక రాజకీయాలను కోరుకుంటున్న రజనీకాంత్‌తో పొత్తు పెట్టుకోవాలని పేర్కొన్నట్లు సమాచారం. రజనీకాంత్‌తో కూటమి ఏర్పాటు చేస్తే తప్పకుండా రాష్ట్రంలో తమ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో రజనీకాంత్‌తో భాజపా కూటమి ఏర్పాటు చేస్తుందని అంతా భావించినా ఎన్నికలకు ‘తలైవర్‌’ దూరం కావడం, తర్వాత పరిణామాల గురించి ప్రముఖంగా చర్చించారు. మదురై, కన్యాకుమారి, చిదంబరం, సేలం, ఈరోడు, కోయంబత్తూరు, ధర్మపురి, వేలూరు, తిరుచ్చి, తంజావూరు, రామేశ్వరం తదితర ప్రాంతాల్లో అంతర్గత సమీక్షలు ఈ నెలాఖరు వరకు జరుగనున్నాయి. అవి ముగిసిన తర్వాత నివేదిక సిద్ధం చేసి దిల్లీలోని అధిష్ఠానానికి పంపనున్నట్లు పార్టీ నిర్వాహకులు తెలిపారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.