Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 113398
            [news_title_telugu_html] => 

ప్రమాణస్వీకారం చేసి, సంతకం మర్చిన రాహుల్

[news_title_telugu] => ప్రమాణస్వీకారం చేసి, సంతకం మర్చిన రాహుల్ [news_title_english] => Rahul Forgets To Sign After Parliament Oath [news_short_description] => వరసగా నాలుగోసారి సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన  కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారం 17వ లోక్‌సభ సభ్యుడిగా సోమవారం  ప్రమాణ స్వీకారం చేశారు. [news_tags_keywords] => Oath,rahul gandhi,Lok Sabha [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-18 00:37:35 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ప్రమాణస్వీకారం చేసి, సంతకం మర్చిన రాహుల్ - Rahul Forgets To Sign After Parliament Oath - EENADU
close

తాజా వార్తలు

ప్రమాణస్వీకారం చేసి, సంతకం మర్చిన రాహుల్

దిల్లీ: వరసగా నాలుగోసారి సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన  కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారం 17వ లోక్‌సభ సభ్యుడిగా సోమవారం  ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన పార్లమెంటు రిజిస్టర్‌లో సంతకం చేయడం మర్చిపోయి, తన స్థానం వద్దకు వెళ్లబోయారు. అయితే అక్కడే ఉన్న అధికారులు, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సహా ఇతర ఎంపీలు ఆయనకు ఆ విషయాన్ని గుర్తు చేశారు. 
గత నెల వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్‌ నుంచి విజయం సాధించారు. మరో నియోజక వర్గం, కాంగ్రెస్‌ కంచుకోట ఉత్తర్‌ ప్రదేశ్‌లోని అమేఠీలో మాత్రం ఆయనకు పరాజయమే మిగిలింది. భాజపా నేత, కేంద్ర మంత్రి స్మతి ఇరానీ చేతిలో అక్కడ ఓటమి పాలయ్యారు. 

ఈ రోజు నుంచి లోక్‌సభ సమావేశాలు ప్రారంభమైనప్పటికీ, రాహుల్ మధ్యాహ్నం నుంచి మాత్రమే సభకు హాజరై ఇంగ్లీషులో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం అధికారులు గుర్తు చేయడంతో రిజిస్టర్‌లో సంతకం చేసి, తల్లి, యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, స్వంత పార్టీ సభ్యుల అభినందనల మధ్య ఆయన స్థానానికి చేరుకున్నారు. లోక్‌సభ సమావేశాలు ప్రారంభమైనప్పటికీ మొదటి రెండు రోజులను 542 మంది సభ్యుల ప్రమాణ స్వీకారానికే కేటాయించారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.