Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 113410
            [news_title_telugu_html] => 

భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జేపీ నడ్డా

[news_title_telugu] => భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జేపీ నడ్డా [news_title_english] => Jp Naddah Appointed as BJP National President [news_short_description] => భాజపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జేపీ నడ్డా నియమితులయ్యారు. [news_tags_keywords] => JP Naddah,BJP [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-17 20:03:55 [news_isactive] => 1 [news_status] => 2 ) )
భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జేపీ నడ్డా - Jp Naddah Appointed as BJP National President - EENADU
close

తాజా వార్తలు

భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జేపీ నడ్డా

దిల్లీ: భాజపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జగత్‌ ప్రకాశ్‌ నడ్డా (జేపీ నడ్డా) నియమితులయ్యారు. ఈ రోజు సాయంత్రం జరిగిన భాజపా అత్యున్నత నిర్ణాయక మండలిగా పేర్కొనే పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటించారు. ఈ నిర్ణయం వెనువెంటనే అమలులోకి వస్తుందని.. బోర్డు సభ్యులంతా నడ్డాకు అభినందనలు తెలియజేశారన్నారు. జేపీ నడ్డా వెంటనే బాధ్యతలు స్వీకరించినట్టు భాజపా వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న నడ్డా.. గత ప్రభుత్వంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా, భాజపా పార్లమెంటరీ బోర్డు కార్యదర్శిగానూ ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. 

గతేడాది డిసెంబర్‌ నాటికే భాజపా జాతీయ అధ్యక్షుడిగా అమిత్‌ షా పదవీ కాలం ముగిసినప్పటికీ లోక్‌సభ ఎన్నికలు సమీపించడంతో ఆయనను మరికొంత కాలం పొడిగించారు. ఇటీవల పార్టీ పదాధికారుల సమావేశంలోనూ అమిత్‌షా పదవీ కాలాన్ని మరింత కాలం పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పార్లమెంటరీ బోర్డు అకస్మాత్తుగా జేపీ నడ్డాను కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రకటించడం విశేషం.  

వ్యూహకర్త నడ్డా..

బిహార్‌లో జన్మించిన నడ్డా అనంతరం హిమాచల్‌ప్రదేశ్‌ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు. రాజకీయ వ్యూహాలను రూపొందించడంలో దిట్ట. ఉత్తర్‌ప్రదేశ్‌కు భాజపా ఇంఛార్జిగా వ్యవహరించిన ఆయన ఈ దఫా ఎన్నికల్లో బలమైన ఎస్పీ-బీఎస్పీ-ఆర్‌ఎల్‌డీ కూటమిని దారుణంగా దెబ్బతీశారు. యూపీలోని 80 సీట్లలో భాజపా కూటమి64 సీట్లను తన ఖాతాలో వేసుకుంది. 2014లో 73 స్థానాలు గెలవగా తాజా ఎన్నికల్లో ఆ సంఖ్య కాస్త తగ్గింది. ఎస్పీ కూటమిని ఢీకొట్టి 64 స్థానాలు గెలవడం ఆషామాషీ వ్యవహారం కాదని రాజకీయపరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికలే కీలకం..
 ఈ ఏడాదిలో మహారాష్ట్ర, ఝార్ఖండ్‌, హరియాణా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో భాజపా అధికారంలో ఉంది. మహారాష్ట్రలో శివసేనతో కలిసి సంకీర్ణ ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామిగాఉంది.  వచ్చే ఏడాది ఆరంభంలో దిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ ఆమ్‌ఆద్మీని ఓడించాలంటే విశేషంగా కృషిచేయాల్సి వుంటుంది. వీటిని దృష్టిలో పెట్టుకొని నడ్డా వ్యూహాలను పదునుబెట్టాల్సిన అవసరముంది. 
 నడ్డా ఎక్కువగా మీడియా ప్రచారానికి ఇష్టపడరు. పార్టీ ఎలాంటి బాధ్యతలు అప్పగించినా పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉంటారని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. నడ్డా సారథ్యంలో కొత్త రాష్ట్రాలు ప్రత్యేకించి దక్షిణాదిలో పాగాకు యత్నించే అవకాశముంది. సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ ఆయన భాజపా 300 కంటే అధిక స్థానాలను గెలుచుకుంటుందని ఘంటాపథంగా చెప్పేవారు. ఆయన విశ్లేషణ వాస్తవరూపం దాల్చడంతో పార్టీ పెద్దలు ఆయనకు పార్టీ కార్యనిర్వాహక  సారథ్య బాధ్యతలను అప్పగించినట్టు తెలుస్తోంది.

నడ్డా నేపథ్యమిదీ..

పూర్తిపేరు: జగత్ ప్రకాశ్‌ నడ్డా
జననం: 1960 డిసెంబరు 2న పట్నాలో
తల్లిదండ్రులు: డాక్టర్ నరేన్ లాల్ నడ్డా, కృష్ణ నడ్డా 
కుటుంబం: భార్య మల్లికా నడ్డా, ఇద్దరు కుమార్తెలు
ఎమ్మెల్యేగా: 1993, 98, 2007లో హిమాచల్‌ప్రదేశ్‌ శాసనసభకు ఎన్నిక
ఎంపీగా: 2014లో తొలిసారి రాజ్యసభకు ఎంపిక

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.