
తాజా వార్తలు
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టీకరణ
దిల్లీ: తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారతానని ఎక్కడా చెప్పలేదని, పార్టీని ప్రక్షాళన చేయాలని మాత్రమే కోరారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. తుది శ్వాస విడిచేవరకూ తాను కాంగ్రెస్‌తోనే ఉంటానని స్పష్టంచేశారు. ఇటీవల రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్ ఆవరణలో వెంకట్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నా పుట్టుక కాంగ్రెస్‌లోనే. 33ఏళ్లుగా పార్టీలో ఎన్ఎస్యూఐ కార్యకర్తగా.. యూత్ కాంగ్రెస్ నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్నాను. పార్టీ మారే ప్రసక్తే ఉండదు. తుది శ్వాస విడిచే వరకూ కాంగ్రెస్‌లోనే ఉంటాం. మళ్లీ మళ్లీ అడగొద్దు. రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ నేనూ చూశా. పార్టీ బాగుండాలని.. ఎన్నికల్లో గెలవాలని.. తెలంగాణ ఇచ్చి రెండోసారి కూడా గెలవలేకపోయాం కాబట్టి ప్రక్షాళన చేయాలని కోరారు తప్ప ఆయన పార్టీ మారతానని ఎక్కడా చెప్పలేదు. నేను బతికి ఉన్నంత వరకూ కాంగ్రెస్‌లోనే ఉంటా. నేనీ స్థాయికి వచ్చానంటే కాంగ్రెస్ పార్టీ పుణ్యానే. నాలుగేళ్లలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తాం. ఎలా తీసుకొస్తామో మీరే చూడండి’’ అని మీడియా ప్రతినిధులతో ఆయన వ్యాఖ్యానించారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- చెప్పేస్తుందేమోనని.. చంపేశారు
- భారతా.. విండీసా.. వరుణుడా.. ఆరంభమెవరిదో?
- షేవ్చేసుకోకుండా.. సేవ చేస్తారు
- ‘మా వస్తువులు మేమే డెలివరీ చేసుకుంటాం’
- విధ్వంసాన్ని చూస్తూ ఊరుకోను: మమత
- తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు
- ‘ఆ నిర్ణయంకాంగ్రెస్ హైకమాండ్ కోర్టులో ఉంది’
- వ్రతాలలోనూ వ్యక్తిత్వ వికాసం!
- నేటి నుంచే ఫాస్టాగ్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
