Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 113887
            [news_title_telugu_html] => 

మోదీని ప్రతిదానికీ పిలవాలా?: కేసీఆర్‌ వ్యాఖ్య

[news_title_telugu] => మోదీని ప్రతిదానికీ పిలవాలా?: కేసీఆర్‌ వ్యాఖ్య [news_title_english] => kcr comments on central govt [news_short_description] => కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పందించారు [news_tags_keywords] => kcr,kaleswaram,ts politics [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/FRxkfKSvzzM [news_videoinfo] => |https://www.youtube.com/embed/FRxkfKSvzzM [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-19 01:04:23 [news_isactive] => 1 [news_status] => 2 ) )
మోదీని ప్రతిదానికీ పిలవాలా?: కేసీఆర్‌ వ్యాఖ్య - kcr comments on central govt - EENADU
close

తాజా వార్తలు

మోదీని ప్రతిదానికీ పిలవాలా?: కేసీఆర్‌ వ్యాఖ్య

హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించకపోవడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పందించారు. ప్రతీ ఘట్టానికీ ఆహ్వానించాల్సిన అవసరం లేదని, గతంలో మిషన్‌ భగీరథ ప్రారంభోత్సవానికి పిలిచిన విషయాన్ని గుర్తుచేశారు. కేంద్రం నుంచి ఒక్కపైసా అదనంగా రాలేదని విమర్శించారు. ‘‘ప్రతిదానికీ ప్రధానిని పిలుస్తామా? అన్నింటికీ పిలవాలా? సంతృప్తిగా నేను ప్రారంభోత్సవం చేస్తున్నా మీకు ఇష్టంలేదా. మేం ఎన్డీయేలో భాగస్వాములం కాదు.. ప్రపంచానికి తెలుసు. ఫెడరల్‌ ఫ్రంట్‌ కోసం నేను పనిచేశాను. రాజ్యాంగపరమైన సంబంధాలు కేంద్రంతో ఎలా కొనసాగించాలో చేస్తాం. లేనివి ఎందుకు?గతంలో మోదీ ప్రధాని అయ్యాక అతి కఠినంగా నిందించిన వ్యక్తిని నేను. ఏడు మండలాలు, సీలేరు పవర్‌ ప్లాంటు ఏపీకి ఇచ్చినప్పుడు ఫాసిస్టు పీఎం అని అన్నాను. కేంద్రం నుంచి మాకు ఒక్క రూపాయి కూడా అదనపు సౌకర్యం ఇవ్వలేదు. మిషన్‌ భగీరథ, కాకతీయకు కలిపి రూ.24వేల కోట్లు ఇవ్వాలని మేం కోరితే ఒక్క రూపాయీ ఇవ్వలేదు. భాజపా జాతీయ అధ్యక్షుడు  అమిత్‌షా అబద్ధాలు మాట్లాడితే ఆయనను క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశాను. కేంద్ర ప్రభుత్వానికి మేం అంశాల వారీగా మద్దతు ఇచ్చాం. నచ్చిన వాటికి మద్దతిచ్చాం..నచ్చని వాటిని వ్యతిరేకించాం’’ అన్నారు.

‘‘ కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీస్టేజ్‌ ఇరిగేషన్‌ పథకం ఇది. 45లక్షల ఎకరాలకు నీరు అందుతుంది. రాష్ట్రంలో 80శాతం ప్రజలకు తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీరందుతుంది. రాష్ట్రం సొంత నిధులు, బ్యాంకుల సహకారంతో ప్రజాఎక్టు నిర్మిస్తున్నాం. 24గంటల నాణ్యమైన విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మాది. రాష్ట్రంలో ఎక్కడా బిందెల ప్రదర్శనలేదు. 2004లో బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ ఏర్పాటుచేసి 15ఏళ్లు గడిచినా అతీగతీలేదు. ట్రైబ్యునల్‌ తీర్పు ఇవ్వడానికే ఇంతకాలం పడితే ప్రాజెక్టులు ఎప్పుడు కట్టాలి? తెలంగాణలో ప్రాజెక్టుల కోసం అహోరాత్రులు శ్రమించాను. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పరుగులు పెట్టిస్తాం. రేపు అఖిలపక్ష పార్టీల అధ్యక్షుల భేటీకి కేటీఆర్‌ హాజరవుతారు’’ అని కేసీఆర్‌ వెల్లడించారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.