close

తాజా వార్తలు

కేసీఆర్‌ అధ్యక్షతన తెరాస కార్యవర్గం భేటీ

హైదరాబాద్‌: తెరాస రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది.  పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో జరుగుతున్న ఈ సమావేశంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మినహా కార్యవర్గ సభ్యులంతా  పాల్గొన్నారు. దిల్లీలో జరుగుతున్న అఖిలపక్ష సమావేశంలో కేటీఆర్‌ పాల్గొన్నారు. పురపాలక సంఘం ఎన్నికలు, పార్టీ సభ్యత్వ నమోదు, జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నట్టు సమాచారం. నిన్న జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో 31 జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణానికి స్థలం కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పరిషత్‌ ఎన్నికల్లో పార్టీ శ్రేణులన్నీ బాగా పనిచేశాయని కేసీఆర్‌ ప్రశంసించారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.