close

తాజా వార్తలు

జమిలితో ధన ప్రవాహానికి అడ్డుకట్ట:కేటీఆర్‌

దిల్లీ: జమిలి ఎన్నికల ప్రతిపాదనను ఆహ్వానించామని.. అఖిలపక్షం సమావేశంలో దీనిపై తమ అభిప్రాయం చెప్పామని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తెలిపారు. రాష్ట్రాలు బలోపేతం అయితేనే దేశం బలపడుతుందనే విషయాన్ని ప్రధాని మోదీ, కేబినెట్‌ మంత్రుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. దిల్లీలోని పార్లమెంట్‌ లైబ్రరీ హాలులో జరిగిన అఖిలపక్ష భేటీ ముగిసిన అనంతరం కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. సుమారు 4 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ముఖ్యంగా ఐదు అంశాలపై చర్చించామన్నారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి కావొస్తుండటం.. మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవాల నిర్వహణ, జమిలి ఎన్నికలు తదితర అంశాలపై ఎలాంటి కార్యక్రమాలు చేపడితే బాగుంటుందనే దానిపై చర్చ జరిగిందని కేటీఆర్‌ వివరించారు.  జమిలి ఎన్నికల నిర్వహణలో సాధక బాధకాలు ఏమున్నా.. తెరాస తరఫున దాన్ని ఆహ్వానిస్తున్నట్లు అభిప్రాయం చెప్పామన్నారు. పరిమిత కాల వ్యవధిలో దీన్ని పూర్తి చేయాలని సూచించామని.. ఒకేసారి ఎన్నికలతో ప్రజలు కూడా ప్రభుత్వ ఫలాలను అనుభవించే వీలుంటుందని కేటీఆర్‌ చెప్పారు. ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అడ్డుకునేందుకు, నిర్వహణ ఖర్చు తగ్గించుకునేందుకు ‘జమిలి’ దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా దఫాలుగా ఎన్నికల నిర్వహణతో ‘కోడ్‌’ అమల్లో ఉండి పాలన కుంటుపడుతోందని చెప్పారు.

జమిలి ఎన్నికల విషయంలో అవసరమైతే రాజ్యాంగ సవరణ చేయాలని.. దీనికి తెరాస పూర్తిగా సహకరిస్తుందని చెప్పినట్లు కేటీఆర్‌ వెల్లడించారు. అధికార వికేంద్రీకరణ జరగాలని.. ముఖ్యంగా వ్యవసాయం, విద్య, వైద్యం అంశాలను రాష్ట్రాలకు బదలాయించాలని కోరామన్నారు. గాంధీ 150వ జయంత్యుత్సవాల్లో భాగంగా కేంద్రం సహకారంతో రాష్ట్రంలో 150 పాఠశాలలు, 150 ఆస్పత్రులు, 150 గ్రామాలను లక్ష్యంగా పెట్టుకుని ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తే బాగుంటుందని సూచించామని.. ఈ అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారని కేటీఆర్‌ తెలిపారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.