
తాజా వార్తలు
వీహెచ్ వార్డుమెంబర్‌గా కూడా గెలవలేరని రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్య
నల్గొండ: టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి మ్యాచ్‌ఫిక్సింగ్ చేస్తున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడానికి ఆయనే కారణమని విమర్శించారు. ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఉత్తమ్ స్పందిస్తూ.. రాజకీయ కారణాలతో పార్టీని నుంచి వెళ్లేవారికైతే ఏదైనా చెప్పొచ్చు గానీ.. ఆర్థికపరమైన కారణాలతో వెళ్లేవారికి ఏం చెప్పగలం అని వ్యాఖ్యానించిన నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి నల్గొండలో స్పందించారు. తనకు షోకాజ్ నోటీసులు ఇచ్చే అర్హత కాంగ్రెస్‌కు లేదన్నారు. కష్టకాలంలో కాంగ్రెస్‌ను ఆదుకున్నది తామేనన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికల సమయంలో ఎవరినీ కలుపుకొని పోలేదని, ఆయనకు నాయకత్వ లక్షణాలే లేవని విమర్శించారు. ఉత్తమ్ టీపీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తేనే పార్టీ గెలుస్తుందన్నారు.
వీహెచ్‌పై ఫైర్!
తన గురించి కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ చేసిన వ్యాఖ్యలపైనా రాజగోపాల్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘వీహెచ్ అసలు వార్డు మెంబర్‌గానైనా గెలుస్తారా? ఎప్పుడైనా ఆయన గెలిచి వచ్చారా?’ అని ప్రశ్నించారు. తాము గెలిచేవాళ్లం గనకే పార్టీ తమకు టికెట్లు ఇచ్చిందన్నారు. 2014లో అంబర్‌పేట నుంచి వీహెచ్ పోటీచేస్తే డిపాజిట్ కూడా దక్కలేదని గుర్తుచేశారు. వీహెచ్ అంటే తమకు గౌరవం ఉందని, అనవసరంగా నోరుపారేసుకోవద్దని సూచించారు. తనను గెలిపించిన మునుగోడు ప్రజలు, తన అనుచరులతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానని రాజగోపాల్ రెడ్డి స్పష్టంచేశారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- తీర్పు చెప్పిన తూటా
- కిర్రాక్ కోహ్లి
- ఉన్నావ్ ఘటన బాధితురాలు మృతి
- ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ
- సచిన్ కుమారుడు ఎందుకు ఆడొద్దు?
- విజృంభించిన విరాట్.. టీమిండియా విజయం
- ఈ అరటిపండు ధర రూ. 85 లక్షలు!
- తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు
- ఎన్‌కౌంటర్‌తో న్యాయం జరగలేదు
- ఆయుధాలు ప్రదర్శనకు కాదు:మీనాక్షి లేఖి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
