
తాజా వార్తలు
విజయవాడ: ఉండవల్లిలోని ప్రజావేదిక కూల్చివేయాలన్న సీఎం వైఎస్ జగన్ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం నిర్ణయాన్ని కొందరు సమర్థిస్తుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ప్రజావేదిక కూల్చివేత నిర్ణయంపై తాజాగా విజయవాడ ఎంపీ, తెదేపా నేత కేశినేని నాని ఫేస్బుక్లో స్పందించారు.
‘‘ప్రజావేదిక అక్రమమో, సక్రమమో పక్కన పెడితే... అది ప్రజాధనంతో నిర్మించిన వేదిక. ప్రజావేదికను తొలగించాలనుకుంటే, అక్రమ నిర్మాణాలన్నీ తొలగించిన తర్వాతే.. ప్రజావేదికను చివర్లో తొలగిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇప్పుడు తొలగిస్తే రాష్ట్ర ఖజానాకు రెండు విధాలుగా నష్టం. ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదికను కూల్చివేస్తే సొమ్ము వృథా అవుతుంది. మరో వేదిక కట్టే వరకు ప్రభుత్వ సమావేశాలు నిర్వహించుకోవాలంటే ప్రైవేటు వేదికలకు డబ్బు ఖర్చవుతుంది. ముందుగా మిగతా అక్రమ నిర్మాణాలను తొలగించి, ఈలోపు కొత్త సమావేశ వేదిక నిర్మించి, అప్పుడు ప్రజావేదిక తొలగిస్తే బాగుంటుందని నా అభిప్రాయం’’ అని కేశినేని తెలిపారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- చెప్పేస్తుందేమోనని.. చంపేశారు
- భారతా.. విండీసా.. వరుణుడా.. ఆరంభమెవరిదో?
- షేవ్చేసుకోకుండా.. సేవ చేస్తారు
- ‘మా వస్తువులు మేమే డెలివరీ చేసుకుంటాం’
- వ్రతాలలోనూ వ్యక్తిత్వ వికాసం!
- విధ్వంసాన్ని చూస్తూ ఊరుకోను: మమత
- ‘ఆ నిర్ణయంకాంగ్రెస్ హైకమాండ్ కోర్టులో ఉంది’
- ‘చావు కబురు చల్లగా’ చెబుతానంటున్న కార్తికేయ
- రాహుల్కు ఆ పేరే కరెక్ట్.. భాజపా ఎటాక్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
