close

తాజా వార్తలు

విపక్షాల ఆందోళనలో సోనియా, రాహుల్

దిల్లీ: కర్ణాటక, గోవాలో చోటుచేసుకుంటోన్న రాజకీయ పరిణామాలపై విపక్షాలన్నీ ఏకమయ్యాయి. పార్లమెంటు ఎదుట  కాంగ్రెస్‌, టీఎంసీ, ఎస్పీ, ఎన్‌సీపీ, ఆర్‌జేడీ, సీపీఐ పార్టీలు ఆందోళన నిర్వహించాయి. ఈ నిరసనలో కాంగ్రెస్‌కు నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఆనంద్ శర్మ, తదితరులు పాల్గొన్నారు.  వారంతా గాంధీ విగ్రహం ఎదుట నిలబడి, నినాదాలు చేశారు. ‘ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి’  అంటూ ప్లకార్టులను ప్రదర్శించారు. 

విప్‌ జారీ చేసిన కాంగ్రెస్‌: అసెంబ్లీలో కాంగ్రెస్‌ చీఫ్ విప్‌ గణేశ్ హక్కరీ ఎమ్మెల్యేలందరికి విప్‌ జారీ చేశారు. రేపటి నుంచి ఆ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వాటిలో ఆర్థిక బిల్లు, ఇతర అంశాలు చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో సభకు హాజరు కానీ వారిపై యాంటీ డిఫెక్షన్‌ చట్టం కింద అనర్హులుగా ప్రకటిస్తామని గణేశ్ హెచ్చరించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.