close

తాజా వార్తలు

ఆర్‌ఎస్‌ఎస్‌,భాజపాకు రాహుల్‌గాంధీ కృతజ్ఞతలు

 

అహ్మదాబాద్: పరవు నష్టం దావా కేసులో భాగంగా విచారణలో పాల్గొనడానికి శుక్రవారం కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. దీనిపై ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ మీద తాను చేస్తోన్న సిద్ధాంతపరమైన పోరాటాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లడానికి ఈ విధంగా తనకు అవకాశం లభించిందన్నారు. అహ్మదాబాద్ జిల్లా కోఆపరేటివ్ బ్యాంకు, దాని ఛైర్మన్‌ మీద రాహుల్ గతంలో చేసిన వ్యాఖ్యలపై ఈ కేసు దాఖలైంది. 

‘నా రాజకీయ విరోధులు ఆర్‌ఎస్‌ఎస్‌, భాజపా దాఖలు చేసిన కేసుకు సంబంధించిన విచారణ నిమిత్తం నేను ఈ రోజు అహ్మదాబాద్‌కు వచ్చాను. నేను చేస్తోన్న సిద్ధాంతపరమైన పోరాటాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లడానికి నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు ఆర్‌ఎస్‌ఎస్‌, భాజపాకు కృతజ్ఞతలు’ అని ఆయన ట్వీట్ చేశారు. విచారణ అనంతరం న్యాయస్థానం ఈ కేసులో రాహుల్‌కు బెయిల్‌ మంజూరు చేసింది. గత వారం కూడా తన మీద దాఖలైన పరవు నష్టం కేసులో భాగంగా రాహుల్ ముంబయి, పట్నా న్యాయస్థానాల్లో హాజరయ్యారు. రాహుల్ మీద వివిధ న్యాయస్థానాల్లో సుమారు 20 కేసులు నడుస్తున్నాయి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.